రాజమౌళి కెరీర్‌ను బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే విభజించి చూడాలి. దాని కంటే ముందు కూడా మగధీర, ఈగ లాంటి భారీ చిత్రాలు తీశాడు కానీ.. బాహుబలి లాంటి రీచ్ వాటికి లేదు. ఆ మాటకొస్తే ఇండియన్ సినిమా చరిత్రలోనే అలాంటి రీచ్ మరే చిత్రానికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాకు సంబంధించి మేకింగ్, ప్రమోషన్, బుకింగ్స్, కలెక్షన్స్.. ఇలా ప్రతిదీ ట్రెండ్ సెట్టింగే.
ఒక సినిమా ట్రైలర్‌ను థియేటర్లలో రిలీజ్ చేయడం.. అందుకోసం పెద్ద స్థాయిలో ప్లానింగ్ జరగడం.. మూడు నిమిషాల లోపు నిడివి ఉన్న ట్రైలర్ చూసేందుకు అభిమానులు సినిమా చూడ్డానికి వచ్చినట్లు రావడం.. ఇదంతా ఒక కొత్త అనుభవం. ఇండియన్ సినిమాలో నభూతో అనిపించే విజువల్స్‌ను నేరుగా బిగ్ స్క్రీన్ మీదే చూసి నోరెళ్లబెట్టారు ప్రేక్షకులు. సినిమా మీద అంచనాలు మరింత పెరగడానికి ఆ స్ట్రాటజీ బాగానే ఉపయోగపడింది.
ఇప్పుడు తన కొత్త చిత్రం ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే ట్రెండ్ కొనసాగించబోతున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ ఈ నెల 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ముందు మూడో తారీఖే ట్రైలర్ లాంచింగ్ అనుకున్నారు కానీ.. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో అది వాయిదా పడింది. తాజాగా కొత్త డేట్ ఇచ్చారు.
ఐతే ఈ ట్రైలర్‌ను కూడా బాహుబలి తరహాలోనే థియేటర్లలో లాంచ్ చేయబోతున్నారట. ఉదయం 10 గంటలకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్దేశించిన థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించబోతున్నారట. ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రైలర్ వదులుతారు. గత నెలలో రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ ఇప్పటికే థియేటర్లలో వివిద సినిమాల మధ్యలో ప్రదర్శితం అవుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ఫుల్ లెంగ్త్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైన ఆడిటోరియాలు షేకైపోవడం ఖాయం.
This post was last modified on %s = human-readable time difference 10:39 pm
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…