నిజానికి ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ తో ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వలన ట్రైలర్ ను వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తామని చెప్పారు కానీ.. ఇంకా ప్రకటించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ ను డిసెంబర్ 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ డేట్ ని ప్రకటిస్తూ.. మరో పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో టీజర్ల ద్వారా చెప్పారు.
ఇప్పుడు ట్రైలర్ లో వీరిద్దరినీ కలిపి చూపించబోతున్నారు. ఈ ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు జక్కన్న. అంచనాలకు ఎంతమాత్రం తగ్గకుండా ట్రైలర్ ను ఎడిట్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో రేంజ్ లో ఉంటుందని సమాచారం. యాక్షన్ సీన్స్ ట్రైలర్ కి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.
జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘దోస్తీ’, ‘నాటు నాటు’, ‘జనని’ లాంటి పాత్రలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ తో మరోసారి ట్రెండ్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి తగ్గట్లుగానే.. ఇప్పటివరకు ఏడువందల కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం.
This post was last modified on December 4, 2021 11:10 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…