నందమూరి నటసింహం, మాస్ కా బాప్ బాలకృష్ణ, టాలీవుడ్ మాస్ ఏస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్లా ఈ చిత్రం ‘అఖండ’ విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ ‘అఖండ’ విజయంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు.
‘అఖండ’ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. కొత్తదనాన్ని ఆదరించే మంచి గుణం మన తెలుగువాళ్లకు ఎప్పుడూ ఉంటుందని కొనియాడారు. ఈ ‘అఖండ’ విజయం మొత్తం సినీ పరిశ్రమ విజయమని చెప్పారు.ఒకప్పుడు భక్తిని రామారావు బ్రతికించారని, ఇప్పుడు భక్తిని ‘అఖండ’ బ్రతికించిందని బాలయ్య ఎమోషన్ అయ్యారు. ఈ చిత్రంలో తెరపై తన నటనను చూసి తానే కాస్త ఆశ్చర్యపోయానని వ్యాఖ్యానించారు.
తాను కేవలం తన దర్శకుడి సూచనలను పాటిస్తానని… తనకు అన్ని సినిమాలు సమానమేనని చెప్పారు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని బాలకృష్ణ కితాబిచ్చారు. ఇక, థియేటర్లలో అయితే బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించే దిశగా కలెక్షన్లు వస్తుండడంతో చాలాకాలంగా చప్పగా ఉన్న బాక్సాఫీస్ దగ్గర సందడి మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ హిట్ టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.
This post was last modified on December 3, 2021 4:15 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…