నందమూరి బాలకృష్ణ ఎక్కువగా మాస్ మసాలా సినిమాలే చేస్తుంటాడు. ఐతే అలాంటి సినిమాలు యుఎస్‌లో అంతగా ఆడవు. ఆయన నుంచి వచ్చిన డిఫరెంట్ మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి మాత్రం అక్కడ మంచి ఫలితం దక్కించుకుంది. దాదాపు 2 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి ఆ చిత్రానికి యుఎస్‌లో. కానీ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన సినిమాలన్నీ యుఎస్‌లో నిరాశ పరిచాయి. బాలయ్య నుంచి చివరగా వచ్చిన ‘రూలర్’ మూవీకి యుఎస్‌లో కనీస స్పందన కూడా రాలేదు. అంతకుముందు రిలీజైన ‘యన్.టి.ఆర్’ రెండు భాగాలకూ నిరాశాజనక ఫలితమే వచ్చింది.
కానీ ఈ ప్రభావం బాలయ్య కొత్త చిత్రం ‘అఖండ’ మీద ఎంతమాత్రం పడలేదు. ఇది రొటీన్ మాస్ మసాలా సినిమానే. మామూలుగా అయితే ఈ సినిమాకు అక్కడ తిరస్కారమే ఎదురవ్వాలి. కానీ ‘అఖండ’ అక్కడ సంచలనం రేపుతోంది. ప్రిమియర్ల సందర్భంగా హంగామా మామూలుగా లేదు.డల్లాస్‌లో వందల కార్లతో ర్యాలీ చేయడమేంటి.. కాలిఫోర్నియాలో థియేటర్ల ముందు వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టడమేంటి.. ఇక థియేటర్లలో అయితే ఆంధ్రా ప్రాంతంలో మాస్ సెంటర్లలో మాదిరి రచ్చ రచ్చ చేయడమేంటి.. మొత్తంగా యుఎస్‌లో ‘అఖండ’ సందడి అలా ఇలా లేదు.
ఈ చిత్రానికి ప్రిమియర్ల ద్వారానే 3.3 లక్షల డాలర్ల వసూళ్లు రావడం విశేషం. బాలయ్య ఏ చిత్రానికీ ప్రిమియర్లతో ఈ స్థాయి వసూళ్లు రాలేదు. ఇదంతా బాలయ్య అభిమానులు, ఎన్నారై టీడీపీ మద్దతుదారులు ‘అఖండ’ను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకోవడం వల్లే సాధ్యమైంది. బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ మద్దతుదారులు అక్కడ థియేటర్లకు థియేటర్లు మొత్తంగా తమ కోసం బుక్ చేసేశారు. దీంతో షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. బోయపాటితో బాలయ్య సినిమా అంటే వారికున్న గురే వేరు. అందుకే ముందే భారీగా టికెట్లు సేల్ అయ్యాయి. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా 3 లక్షల డాలర్లకు పైగా కొల్లగొట్టేసింది. వీకెండ్ అంతా ఈ సందడి కొనసాగేలాగే కనిపిస్తోంది.
This post was last modified on December 3, 2021 3:28 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…