శ్రీకాంత్ అనగానే అతను చేసిన కుటుంబ కథా చిత్రాలు, సాఫ్ట్ లవ్ స్టోరీలే గుర్తుకొస్తాయి. కెరీర్ ఆరంభంలో కొన్ని నెగెటివ్ రోల్స్ చేసినప్పటికీ.. హీరోగా స్థిరపడ్డాక మాత్రం సాఫ్ట్ సినిమాలకే పరిమితం అయ్యాడు. అతడికి వచ్చిన ఇమేజ్ కూడా అలాంటిదే. అలాంటి వాడికి ‘అఖండ’ సినిమాలో చాలా వయొలెంట్ రోల్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. హీరోగా అవకాశాలు తగ్గాక కూడా క్యారెక్టర్ రోల్స్ సైతం సాఫ్ట్‌గా ఉన్నవే చేసిన శ్రీకాంత్‌ను మళ్లీ విలన్ని చేయాలన్న ఆలోచనే ఆశ్చర్యం కలిగించేది. అలాంటిది వయొలెంట్ క్యారెక్టర్ చేయించడం ఇంకా చిత్రం. ఇంతకుముందే ‘యుద్ధం శరణం’లో మళ్లీ విలన్ పాత్ర చేసినా అది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
ఇప్పుడు ‘అఖండ’తో అయినా శ్రీకాంత్ కెరీర్ మలుపు తిరుగుతుందా.. ‘లెజెండ్’లో జగపతిబాబు లాగే శ్రీకాంత్‌కు కూడా గొప్ప పేరొచ్చి అతడి దశ తిరిగిపోతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు.కానీ ‘అఖండ’లో శ్రీకాంత్ ఎంత బాగా చేసినప్పటికీ.. అతను చేసిన వరద రాజులు పాత్ర అయితే అనుకున్నంతగా పండలేదు. ఆ పాత్ర ఇంట్రో సీన్ చాలా భయంకరంగా ఉండి దానిపై అంచనాలు పెంచుతుంది కానీ.. తర్వాత ఆ పాత్ర గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. బాలయ్యతో ఫస్ట్ ఫేస్ ఆఫ్ సీన్లో ఇద్దరూ పంచ్ డైలాగులు పేల్చుకున్నారే తప్ప అందులో అంతగా విషయం లేదు.
ఆ తర్వాత కూడా శ్రీకాంత్ పాత్ర సాధారణంగా సాగిపోతుంది. మెయిన్ విలన్‌గా వేరే వ్యక్తిని పెట్టడం.. ఆ పాత్రతోనే క్లైమాక్స్ ప్లాన్ చేయడం.. అంతకంటే ముందే సింపుల్‌గా రెండో బాలయ్య చేతిలో శ్రీకాంత్ పాత్ర హతమవ్వడంతో ఈ పాత్ర సడెన్‌గా, సింపుల్‌గా ముగిసిపోయినట్లు అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే శ్రీకాంత్ క్యారెక్టర్ వెయ్యాల్సిన ఇంపాక్ట్ అయితే వెయ్యలేదు. దీని తర్వాత మిగతా దర్శకులు కూడా శ్రీకాంత్‌కు విలన్ రోల్స్ ఆఫర్ చేస్తారా.. అతడికి సరైన పాత్రలు పడతాయా అన్నది సందేహంగానే ఉంది.
This post was last modified on December 3, 2021 12:53 pm
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…