మరక్కార్.. మరక్కార్.. కొన్ని రోజులుగా పాన్ ఇండియా లెవెల్లో చర్చనీయాంశం అవుతున్న సినిమా ఇది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఆయన మిత్రుడు, లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ రూపొందించిన భారీ చిత్రమిది. మాలీవుడ్‌లో తొలిసారిగా రూ.100 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాను అక్కడి వాళ్లు తమ బాహుబలిగా భావించారు. నిజానికి ఈ చిత్రం గత ఏడాది మార్చిలో విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి ఓటీటీ రిలీజ్‌కు డీల్ కూడా చేసుకున్నాక.. మళ్లీ మనసు మార్చుకుని ఎట్టకేలకు గురువారం థియేట్రికల్ రిలీజ్ ద్వారానే మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
విడుదలకు ముందే జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుని.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు ఆశించినంత మంచి టాక్ అయితే రాలేదు.విజువల్‌గా ‘మరక్కార్’ అద్భుతం అనిపించినా.. కథాకథనాలు అంత ఆసక్తికరంగా లేవంటున్నారు. కథ గందరగోళంగా ఉందని.. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారని.. ఎమోషన్ సరిగా పండలేదని అంటున్నారు. అందరూ మోహన్ లాల్ పెర్ఫామెన్స్‌ను కొనియాడుతున్నప్పటికీ.. పకడ్బందీ స్క్రీన్ ప్లే లేని ఈ సినిమాను ఆయన కూడా కాపాడలేకపోయాడు అంటున్నారు. అలా అని ఇది తీసి పడేసే సినిమా కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
టీజర్లు, ట్రైలర్లు చూసి ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు సినిమా దూరంలో నిలిచిపోయిందన్ని మెజారిటీ జనాలు చెబుతున్న మాట. ఐతే టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే గ్యారెంటీ. కేరళలో ప్యాక్డ్ హౌసెస్‌తో సినిమా నడుస్తోంది. ఓవర్సీస్‌లో సినిమాకు రెస్పాన్స్ అదిరిపోతోంది. వీకెండ్ వరకు ‘మరక్కార్’ వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత సినిమా ఏమేర నిలుస్తుందన్నదే సందేహం. ఈ చిత్రం తెలుగులో ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం విడుదల కానుంది.
This post was last modified on December 2, 2021 6:24 pm
ఇటీవలే అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో దగ్గుబాటి రానా, తేజ సజ్జ చేసిన యాంకరింగ్ లో ఇతర హీరోల…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలువైపులా విస్తరింపజేసిన లెజెండ్స్ జీవితాలను తెరమీద చూపించే ప్రయత్నం మహానటితో మొదలయ్యింది. అది సాధించిన…
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…