దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పనులన్నీ ఎప్పుడో పూర్తి చేసేశారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా దాదాపు పూర్తయినట్లే. సినిమా నిడివి మూడు గంటల పాటు ఉంటుందని సమాచారం. జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. దీంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. సినిమా నుంచి టీజర్లు, పాటలను విడుదల చేస్తూ.. రోజురోజుకి అంచనాలను పెంచేస్తున్నారు. డిసెంబర్ 3న సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది.
ఇలాంటి సమయంలో రాజమౌళి మరోసారి సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం.. రాజమౌళి ఓ ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించాలని భావిస్తున్నారు. రామ్ చరణ్, అలియాభట్ ల మీదే ఈ ప్రమోషనల్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. సినిమాలో వారిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ పెద్దగా ఉండదట. దీంతో ఇద్దరిపై ఓ రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తే.. బాలీవుడ్ మార్కెట్ లో మరింత ప్రమోట్ చేసుకోవచ్చని భావిస్తున్నారు.
కానీ ట్రైలర్ కి వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఓ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ట్రైలర్ ఇంటర్నేషనల్ రేంజ్ లో వైరల్ అయితే.. ప్రమోషనల్ సాంగ్ ఐడియాను పక్కన పెట్టేస్తారట. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.700 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. నిజానికి కోవిడ్ గనుక లేకపోతే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్ విషయంలో ఎక్స్ ట్రా కేర్ తీసుకుంటుంది.
This post was last modified on November 30, 2021 1:54 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…