తెలుగు ‘బిగ్ బాస్’ ఐదో సీజన్ మొదలైనపుడు షోలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకడవుతాడని.. ఫైనల్ వరకు ఉంటాడని అంచనా వేసిన వాళ్లలో యాంకర్ రవి ఒకడు. ఈసారి షోలో పాల్గొన్నవారిలో ఎక్కువ ఫేమ్ ఉన్నది అతడికే అని చెప్పాలి. కాకపోతే యాంకర్‌గా రవిని అభిమానించే వాళ్లతో పాటు అతడి యాటిట్యూడ్ నచ్చని వాళ్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. కాబట్టి అతను షోలో ఎంత వరకు సర్వైవ్ అవుతాడో అన్న డౌట్లు కూడా కలిగాయి.
రవి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంత త్వరగా అయితే షో నుంచి బయటికి వెళ్లడని అనుకున్నారు. కాబట్టే ఇన్నాళ్లూ అతను విజయవంతంగా హౌస్‌లో కొనసాగుతూ వచ్చాడు. కానీ ‘బిగ్ బాస్’ చివరి దశకు వస్తున్న తరుణంలో అతను వేటు నుంచి తప్పించుకోలేకపోయాడు. గత వారం ఎలిమినేషన్ జాబితాలోకి వచ్చిన అతడికి వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు పడటంతో షో నుంచి నిష్క్రమించక తప్పలేదు.
ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రసారం కావడానికి రెండు రోజుల ముందే రవి వైదొలగబోతున్నాడని వార్తలు బయటికి వచ్చేశాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ చివరి దశలో కాజల్ సేవ్ అయింది. రవి ఎలిమినేట్ అయ్యాడు. ఐతే బయట రవిని అభిమానించే వాళ్లకు ఈ విషయం మింగుడు పడలేదు. ‘బిగ్ బాస్’ షో నడుస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. రవి షో నుంచి వైదొలగడానికి వీల్లేదని.. ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి అతణ్ని మళ్లీ హౌస్‌లోకి పంపాలని డిమాండ్ చేస్తున్న తన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ గేటు బయట నిలబడి గొడవ డొడవ చేశారు.
దీంతో కొంతసేపు ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి పంపించాల్సి వచ్చింది. కాగా యాంకర్ రవికి ఉన్న పాపులారిటీ వల్ల అతను బిగ్ బాస్ విజేతను మించి పారితోషకం అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. వారానికి ఏడెనిమిది లక్షల చొప్పున ఇప్పటిదాకా షో నడిచిన 12 వారాలకు గాను దాదాపు కోటి రూపాయల పారితోషకాన్ని అతను పుచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on November 29, 2021 3:41 pm
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…