మరక్కార్: ది లయన్ ఆఫ్ అరేబియన్ సీ.. మలయాళ సినిమా పరిశ్రమలో ఒక ‘బాహుబలి’ అవుతుందని అంచనాలు రేకెత్తిస్తున్న సినిమా. మాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ప్రధాన పాత్రలో లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా, రూ.100 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. హాలీవుడ్ మూవీ ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ తరహాలో తెరకెక్కించిన భారీ చిత్రమిది.
విడుదలకు ముందే జాతీయ అవార్డుల్లో పోటీ పడి 2021 సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా దక్కించుకుంది ‘మరక్కార్’. టీజర్, ట్రైలర్లతో భారీగా అంచనాలు రేకెత్తించిన ‘మరక్కార్’ను ఒక దశలో ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని.. ఆ తర్వాత ఆ డీల్ క్యాన్సిల్ చేసి డిసెంబరు 2న థియేట్రికల్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయాలన్నది ముందున్న ప్రణాళిక.
ముందు నుంచి తెలుగులోనూ ప్రమోషన్లు చేస్తున్నారు. కానీ రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి కథ మారిపోయింది. ఏమైందో ఏమో కానీ.. ‘మరక్కార్’ను డిసెంబరు 2న తెలుగులో రిలీజ్ చేయట్లేదు. మిగతా నాలుగు భాషల్లోనూ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆదివారం కొత్తగా రిలీజ్ టీజర్ వదలగా.. అది నాలుగు భాషలకే పరిమితం అయింది. రిలీజ్ పోస్టర్లు కూడా ఆ నాలుగు భాషల్లోనే ఉన్నాయి.
తెలుగులో థియేటర్ల బుకింగ్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఓటీటీల ద్వారా మోహన్ లాల్ సినిమాలకు బాగా అలవాటు పడ్డారు తెలుగు జనాలు. అంతకుముందు జనతా గ్యారేజ్, పులి మురుగన్ లాంటి సినిమాలు కూడా ఆయనకు తెలుగులో మంచి ఆదరణ తెచ్చాయి. మోహన్ లాల్‌తో పాటు కీర్తి సురేష్, అర్జున్, కళ్యాణి ప్రియదర్శన్ లాంటి తెలుగు వాళ్లకు పరిచయమున్న నటీనటులు కీలక పాత్రలు పోషించడం కూడా ‘మరక్కార్’ ఆసక్తిని పెంచేదే. కానీ ఈ భారీ చిత్రాన్ని తెలుగులో ఎందుకు రిలీజ్ చేయట్లేదన్నది మాత్రం అర్థం కావడం లేదు. ఇది మన వాళ్లకు నిరాశ కలిగించే విషయమే.
This post was last modified on November 28, 2021 1:55 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…