ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ సినిమాలతో కెరీర్ ఆరంభంలో చాలా ప్రామిసింగ్‌గా కనిపించాడు. ఒకప్పుడు ఉదయ్ కిరణ్‌కు కెరీర్ ఆరంభంలో వచ్చిన క్రేజ్ రాజ్‌కు కూడా వచ్చింది. చిన్న సినిమాల నిర్మాతలు, దర్శకులు అతడి వెంట పడ్డారు. అనిల్ సుంకర అయితే ఒకేసారి మూడు సినిమాలకు అతడితో డీల్ చేసుకున్నాడు. కానీ వరుస పరాజయాలు వస్తే ఎలాంటి హీరో అయినా ఉన్న క్రేజ్‌ను కోల్పోక తప్పదు. రాజ్ తరుణ్ విషయంలోనూ అదే జరిగింది.
పైన చెప్పుకున్న సినిమాల తర్వాత అతడికి ఇప్పటిదాకా నిఖార్సయిన హిట్ ఒకటీ రాలేదు. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి ఒకటీ అరా సినిమా ఓ మోస్తరుగా ఆడాయంతే. హిట్టు కోసం రకరకాల కాంబినేషన్లలో, జానర్లలో సినిమాలు చేస్తున్నాడు కానీ.. ఏవీ అంతగా ఫలితాన్నివ్వలేదు. చివరగా అతడి నుంచి వచ్చిన ‘పవర్ ప్లే’ సంగతేమైందో తెలిసిందే.
కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన స్థితిలో రాజ్.. తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియోస్ గడప తొక్కాడు. ఈ బేనర్లో కొత్తగా ‘అనుభవించు రాజా’ అనే సినిమా చేశాడు. ఇంతకుముందు రాజ్‌తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా చేసిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో సెక్యూరిటీ గార్డ్‌గా జీవితాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత ఊరి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచే కుర్రాడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపించనున్నాడు.
తెలుగులో ఇంకేవీ చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేని టైంలో ఆల్మోస్ట్ సోలోగా బరిలోకి దిగుతున్నాడు రాజ్. ట్రైలర్ చూస్తే ప్రామిసింగ్‌గానే కనిపించింది. మంచి ఎంటర్టైనర్ లక్షణాలున్న సినిమాలా కనిపిస్తోంది. దీనికి పోటీగా తమిళ డబ్బింగ్ మూవీ ‘ది లూప్’ కూడా ఈ రోజే రిలీజవుతోంది. దానిపై పెద్దగా అంచనాలు లేవు. కాకపోతే తమిళంలో మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో కొంత పోటీ తప్పదు. మరి రాజ్ ఈ పోటీని తట్టుకుని తన హిట్టు కరవు తీర్చుకుంటాడేమో చూడాలి.
This post was last modified on November 26, 2021 10:42 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…