అక్కినేని నాగచైతన్యతో సమంత పెళ్లి నాలుగేళ్లు తిరగకుండానే విఫలం కావడం.. ఇద్దరూ కొన్ని నెలల కిందటే విడిపోవడం అభిమానులకు ఇంకా జీర్ణం కావడం లేదు. టాలీవుడ్ అనే కాక ఇండియన్ సినిమాలోనే మోస్ట్ లవబుల్ పెయిర్ లాగా కనిపించిన వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో కానీ.. ఇంత త్వరగా విడిపోతారని, విడాకులు తీసుకుంటారని ఎవ్వరూ ఊహించలేదు. ఇందుకు దారి తీసిన కారణాల పట్ల విపరీతమైన చర్చ జరిగింది. వీరిలో ఎవరు ఎవరిని వద్దనుకున్నారు అనే చర్చ కూడా నడిచింది.
ఐతే గత కొన్ని నెలల్లో చైతూ, సమంతల ప్రవర్తన చూస్తే మాత్రం కచ్చితంగా సమంతలోనే ఎక్కువ ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. చైతూనే ఆమెను వేరేలా అర్థం చేసుకుని, తనను వద్దనుకున్నాడేమో అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. తమ విడాకుల సంగతి ఇంకా బయటికి రాని టైంలో తిరుమలకు వచ్చిన సమంతను ఓ విలేకరి దీని గురించి ప్రశ్నిస్తే ఆమె బుద్ధుందా అంటూ చిరాకు పడ్డ తీరును బట్టి తన ఫ్రస్టేషన్ అర్థమైపోయింది.
ఇక ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పెట్టిన కొన్ని ఇన్ డైరెక్ట్ పోస్టుల్ని బట్టి కూడా చైతూ నుంచి విడిపోవడం ఆమెను బాధిస్తోందని అర్థమైంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోలో సమంతను చూసిన వాళ్లకు కూడా ఆమె బాధలో ఉందనే భావన కలిగింది. ఇక తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు సమంత వ్యవహరించిన తీరు.. ఆమె ఎంతగా హర్ట్ అయిందో తెలియజేస్తుంది.
గతంలో సినీ జంటలు విడిపోయాక ఒకరినొకరు బర్త్‌డేల సమయంలో విష్ చేసుకోవడం.. జంటగా విడిపోయినా, ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నించడం గమనింవచ్చు. కానీ సమంత మాత్రం అలా చేయలేదు. చైతూ పుట్టిన రోజు నాడు తనకు విష్ చేయలేదు. సరి కదా తన పెట్ డాగ్ బర్త్ డేను సెలబ్రెట్ చేసి సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీన్ని బట్టి చైతూ విషయంలో ఆమె బాగా హర్ట్ అయిందని.. అయిష్టంగా తన నుంచి విడిపోయిందని.. ఆ కోపాన్ని ఇలా పరోక్షంగా చూపిస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 25, 2021 9:12 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్‌గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…