ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల గొడవ ఎంతకీ తెగట్లేదు. త్వరలో పరిస్థితి మారుతుందని నెలల తరబడి ఎదురు చూస్తున్నా సానుకూల సంకేతాలేమీ కనిపించడం లేదు. మిగతా విన్నపాల సంగతెలా ఉన్నప్పటికీ.. బి-సి సెంటర్లలో ఎన్నో ఏళ్ల కిందటి రేట్లను అనుసరించి టికెట్లు అమ్మడమంటే చాలా కష్టమని, కామన్ రేటు రూ.100 ఉండేలా చూడాలని ఎగ్జిబిటర్లు, నిర్మాతలు కోరుతున్నారు.
కానీ ప్రభుత్వం ఆ దిశగా సానుకూలత వ్యక్తం చేసినట్లే చేసి నిర్ణయం మాత్రం తీసుకోవట్లేదు. రెండు నెలల కిందట రిపబ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీయడం.. తాజాగా చంద్రబాబుపై వ్యక్తిగత వ్యాఖ్యల దాడి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో జగన్ సర్కారు మరింత ఇగోకు వెళ్లినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హడావుడిగా కొన్ని తీర్మానాలతో బిల్లు పెట్టి అసెంబ్లీలో ఆమోద ముద్ర కూడా వేసేశారు.
దీంతో వచ్చే వారం విడుదల కాబోయే అఖండను మొదలుకుని ఆ తర్వాత షెడ్యూల్ అయిన పుష్ప, ఆర్‌ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలకు గట్టి దెబ్బ తప్పదని తేలిపోయింది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతో తగ్గి ఉంటూ వారిని ప్రాధేయపడుతూ వచ్చిన సినీ పెద్దలు ఇప్పుడేం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం చెబుతున్న రేట్లతో టికెట్లు అమ్మితే మాత్రం భారీ గండి తప్పదు. ఓవైపు అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమా టికెట్ల రేట్లను మాత్రం ప్రభుత్వం నియంత్రించడం ఎంతవరకు సహేతుకం అన్న లాజికల్ ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో ఇక కోర్టులో పోరాడటం తప్ప వేరే మార్గం లేదు. నిజానికి ఈ దిశగా ఇంతకుముందే ఆలోచన చేశారు కానీ.. ప్రభుత్వం మనసు మార్చుకుంటుందేమో అని చూశారు.
కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పవని, ప్రైవేటు వ్యక్తులు నిర్మించే సినిమా మీద ప్రభుత్వ పెత్తనం ఏంటన్న వాదన వస్తుందని, ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని కొట్టి వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఎదురెళ్తే ఏమవుతుందో ఏమో అన్న భయం నిర్మాతల్లో ఉండటం సహజం. కాబట్టి ఇంకోసారి సంప్రదింపుల కోసం ప్రయత్నించి అప్పటికీ పరిస్థితి మారకుంటే కోర్టుకెళ్లడం మినహా మరో మార్గం లేనట్లే.
This post was last modified on November 24, 2021 9:42 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…