అక్కినేని అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టైమ్ వచ్చేసింది. బంగార్రాజు టీజర్ విడుదలయ్యింది. ఈ చిత్రంలో నాగార్జున ఎలా ఉంటాడో ఆల్రెడీ చూసేశారు. ఇక నాగచైతన్య ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే అందరూ ఆరాటపడ్డారు. ఇవాళ దానిపై క్లారిటీ వచ్చింది. చైతుకి సంబంధించిన టీజర్ వచ్చి ఇంప్రెస్ చేసింది.
టీజర్‌లో నాగచైతన్యను చూస్తుంటే సోగ్గాడే చిన్నినాయనాలో నాగార్జునను చూసినట్టే అనిపిస్తోంది. అదే బాడీ లాంగ్వేజ్.. అదే స్టైల్.. అదే గ్లామర్. స్టైల్‌గా నడుస్తూ దుడ్డుకర్రను నేలకేసి కొట్టడం.. అది గాల్లోకి లేచి వెళ్లి బైక్‌కి ఫిక్సవడం.. చైతు సోగ్గా నడుచుకుంటూ వెళ్లి బైక్ ఎక్కడం.. ఇవన్నీ ఫస్ట్ పార్ట్‌లో నాగార్జుననే తలపిస్తున్నాయి. అందులో నాగార్జునని ఎలా ఎలివేట్ చేశాడో ఇందులోనూ చైతుని అలాగే చూపించాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. అయితే నాగ్ పూర్తి ట్రెడిషనల్‌గా ఉంటే.. చైతు మాత్రం ట్రెండీ లుక్‌లో అదరగొడుతున్నాడు.
మరో విశేషమేమిటంటే చైతుని చిన బంగార్రాజుగా సంబోధించడం. అసలు ఈ చిత్రంలో వీరిద్దరూ ఏయే పాత్రల్లో కనిపించబోతున్నారనే సస్పెన్స్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇది సీక్వెలా ప్రీక్వెలా.. ఒకరికి ఒకరు ఏమవుతారు అనే డైలమాలో ఉన్నారు ప్రేక్షకులు. నాగ్ అయితే బంగార్రాజుగా కనిపిస్తాడని ఫిక్స్. ఇప్పుడు చైతుని చిన బంగార్రాజు అనడంతో తన క్యారెక్టర్‌పై కూడా క్లారిటీ వచ్చినట్టయ్యింది. కచ్చితంగా ఇద్దరూ తాతామనవళ్లే అయ్యుంటారని అర్థమవుతోంది.
ఆల్రెడీ ‘మనం’ మూవీలో నాగ్, చైతుల కాంబో అదరగొట్టేసింది. ఈ సినిమా అంతకు మించి ఉంటుందనే నమ్మకం ఈ టీజర్‌తో కలుగుతోంది. నాగార్జునకి జంటగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతీశెట్టి కనిపించబోతున్నారు. ఆల్రెడీ వాళ్ల లుక్స్ కూడా విడుదలై ఆకట్టుకున్నాయి. మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్స్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ముందు ముందు మరిన్ని అప్‌డేట్స్‌తో ఫీస్ట్ ఇవ్వడం గ్యారంటీ.
This post was last modified on November 23, 2021 12:28 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…