ఎన్టీఆర్ అస్సలు లెక్క చేయట్లేదేంటి?

నటి మీరా చోప్రాపై కొందరు ఎన్టీఆర్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేసారు. దానిపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా, పోలీసులు రంగంలోకి దిగారు. మంత్రి కేటీఆర్ కూడా దీనిపై స్పందించి ట్వీట్ చేసారు. అయితే ఇంత జరుగుతున్నా ఎన్టీఆర్ అసలు స్పందించలేదు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ చివరిగా చేసిన ట్వీట్స్ లో ఒకటి అభిమానులే తన బలం, వారికీ సదా రుణపడి ఉంటా అంటూ ఉంది.

మీరా చోప్రా డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని ట్యాగ్ చేసి, ట్వీట్ కానీ వీడియో కానీ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అయినా కానీ తారక రాముడు మౌనముద్రలోనే ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ సంజాయిషీ ఇచ్చుకునేది ఏమీ లేదు. లక్షల మంది అభిమానులు ఎలా ఉండాలనేది ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడు. అయితే లోగడ ఇలాంటి ఫిర్యాదు తన అభిమానులపై వచ్చినపుడు తమిళ స్టార్ అజిత్ చాలా ఘాటుగా స్పందించాడు.

తన అభిమాన సంఘాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్టీఆర్ కూడా అలా అభిమానులను మందలించాలని, మిగతా హీరోల అభిమానులు కూడా సోషల్ మీడియాలో పద్ధతిగా మసలుకొనేలా చూసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికి అయితే సైలెంట్ గా ఉన్నాడు.