భీమ్లా నాయక్ సంక్రాంతి రిలీజ్ విషయంలో అనుమానాలు పెట్టుకోవాల్సిన పనేమీ లేనట్లే. దిల్ రాజు అండ్ కో రంగంలోకి దిగినా చిత్ర బృందం తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కనిపించడం లేదు. జనవరి 12న రిలీజ్ పక్కా అని నొక్కి వక్కాణిస్తున్నారు సోషల్ మీడియాలో. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా నిర్ణయం మార్చుకోకూడదని భీమ్లా నాయక్ టీం ముందే నిర్ణయించుకోవడంతో ఆ చిత్రం సంక్రాంతి పోరుకు రెడీ అయిపోయింది.
ఆర్ఆర్ఆర్ విడుదలైన ఐదు రోజులకు, రాధేశ్యామ్ రావడానికి రెండు రోజుల ముందు.. అంటే జనవరి 12నే భీమ్లా నాయక్ థియేటర్లలోకి దిగనుంది. ఇందుకోసం థియేటర్ల బుకింగ్స్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ నుంచి థియేటర్ల విషయంలో మంచి అండ లభిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇంత పోటీలో వస్తున్నప్పటికీ.. భీమ్లా నాయక్‌కు బిజినెస్ బాగానే జరుగుతోందట.
రూ.95 కోట్ల దాకా భీమ్లా నాయక్ థియేట్రికల్ హక్కులు పలికినట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం చూస్తే థియేట్రికల్ బిజినెస్ ఈజీగా రూ.100 కోట్లు దాటిపోవాలి. కానీ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌లతో పోటీ, పైగా థియేటర్లు తగ్గిపోతుండటం.. దీనికి తోడు ఏపీలో టికెట్ల రేట్ల విషయంలో సందిగ్ధత.. ఈ కారణాల వల్ల బిజినెస్ మీద ప్రభావం పడింది.
ఇన్ని ప్రతికూలతల మధ్య భీమ్లా నాయక్ రూ.90-95 కోట్ల మధ్య బిజినెస్ చేసిందంటే గొప్ప విషయమే అని చెప్పాలి. ఇందులో నైజాం హక్కులే రూ.40 కోట్ల దాకా పలికినట్లు తెలుస్తోంది. ఆంధ్రా, రాయలసీమలో రేట్లు కొంచెం తగ్గి రూ.60 కోట్లకు పైచిలుకు రేటు వచ్చింది. మామూలుగా చూస్తే రికవరీ ఈజీనే అనిపిస్తున్నప్పటికీ.. ఆర్ఆర్ఆర్ ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందన్నదాన్ని బట్టి భీమ్లా నాయక్ బయ్యర్లు సేఫ్ జోన్లోకి రావడం, లాభాల బాట పట్టడం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on November 22, 2021 9:57 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…