యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమాను ముందుగా ఈ ఏడాది జూన్ లేదా జూలై నెలల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ సినిమాను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అవ్వడంతో కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. అయితే అదే సమయానికి నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కూడా రిలీజ్ ఉండడంతో పోటీ తప్పదని అనుకున్నారు.
ఈ విషయంలో ఇరు సినిమాల మేకర్స్ చర్చించుకున్నారు. నాని అందరికంటే ముందే క్రిస్మస్ స్లాట్ బుక్ చేసుకోవడంలో ఇప్పుడు వెనక్కి తగ్గడానికి అంగీకరించలేదు. వరుణ్ తేజ్ ‘గని’ని కూడా పోస్ట్ పోన్ చేయాలనుకోలేదు. కానీ ఫైనల్ గా మెగాహీరో కాంప్రమైజ్ అయినట్లుగా తెలుస్తోంది. క్రిస్మస్ పోటీ నుంచి ‘గని’ సినిమా తప్పుకుంటుందట. కానీ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం లేదని సమాచారం. నాని సినిమాకి వారం గ్యాప్ ఇచ్చి డిసెంబర్ నెలాఖరున లేదా జనవరి 1న తమ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
కొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మొత్తానికి నాని సినిమాకి కాస్త స్పేస్ దొరికిందనే చెప్పాలి. ఇక డిసెంబర్ లో వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. బాలయ్య ‘అఖండ’తో మొదలుపెడితే.. ఆ తరువాత కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖీ’, అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలు విడుదల కానున్నాయి. వీటితో పాటు ‘శ్యామ్ సింగరాయ్’, ‘గని’ ఎలానూ ఉంటాయి.
This post was last modified on November 22, 2021 9:30 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…