టాలీవుడ్‌లోనే కాదు, ఇండియా వైడ్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ‘పుష్ప’పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్‌లో స్థానం దక్కిందీ సినిమాకి. దానికి తోడు వరుస అప్‌డేట్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటూ పోతున్నాడు సుకుమార్. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పటికీ ఓ డౌట్ వెంటాడుతోంది ప్రేక్షకుల్ని. ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టుగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న వస్తుందా అని.
దానికి కారణం ఉంది. పుష్ప షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రమోషన్స్ అంటే పీక్స్‌లో ఉన్నాయి కానీ, బ్యాగ్రౌండ్‌లో వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకొక నెలలో రిలీజ్ ఉన్నా, ఇప్పటికీ ర్యాపప్ అనే మాట టీమ్ నోటి నుంచి రాలేదు. పైగా ఈ మధ్యనే సమంత స్పెషల్ సాంగ్ చేస్తోందని అనౌన్స్ చేశారు. ఈ పాట ఇప్పటికింకా షూట్ చేయనేలేదంట. ప్రస్తుతం సామ్ రిహార్సల్స్ చేస్తోందట. ఈ నెల 28 నుంచి ప్రత్యేకంగా వేసిన ఓ సెట్‌లో షూట్ చేయబోతున్నట్టు తెలిసింది.
దాంతో ఈ పాట ఒక్కటే ఉందా, ఇంకా ఏవైనా ప్యాచప్ వర్క్స్ బ్యాలన్స్ ఉన్నాయా అనే సందేహం కలుగుతోంది. సాధారణంగా సినిమా మొత్తం పూర్తయ్యాక షూట్ కంప్లీట్ అనే అప్‌డేట్ ఇస్తారు. ఆలోపు ఒక్కో యాక్టర్ పోర్షన్ పూర్తవుతూ ఉంటే వాళ్లు కూడా తమ పార్ట్ అయిపోయిందంటూ అప్‌డేట్ చేయడం ప్రతి పెద్ద సినిమాకీ జరిగేదే. కానీ ఈ మూవీ విషయంలో అలాంటివేమీ లేవు. ఇప్పటి వరకు హీరో హీరోయిన్ల నుంచి ఏ ఒక్కరూ అలాంటి మాట చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ కారణాలన్నింటి వల్లే ‘పుష్ప’ రిలీజ్‌పై డౌట్ పడుతూనే ఉన్నారు అభిమానులు. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటి వరకు తమ మాటకే కట్టుబడి ఉన్నారు. డిసెంబర్ 17కి వచ్చేస్తామనే చెబుతున్నారు. వారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే పుష్ప రాక ఖాయమే అనిపిస్తోంది. అయితే ఈమధ్య ఎప్పుడు ఏ సినిమా వాయిదా పడుతుందో తెలియని కన్‌ఫ్యూజన్ ఏర్పడుతూ ఉండటంతో పూర్తిగా నమ్మడం కష్టమనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో.
This post was last modified on November 21, 2021 12:42 pm
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…