ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంగా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంట్లో కాలుజారి పడ్డారు. దాంతో ఆయన్ను హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందించారు. అనంతరం కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
వయసురీత్యా ఆయన కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. బయటకు కూడా రావడం లేదు. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు కొందరు ప్రముఖులు ఆయన్ను ఇంటికి వెళ్లి కలిసొస్తున్నారు. మొన్నామధ్య చిరంజీవి దంపతులు వెళ్లొచ్చారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కైకాల సత్యనారాయణ. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు.
నవరస నట సార్వభౌమగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. తనదైన నటనతో అభిమానులను సొంతం చేసుకున్నారు. తన కెరీర్ లో 700కి పైగా చిత్రాల్లో నటించారు. 1935లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో జూలై 25న కైకాల జన్మించారు. పాతికేళ్ల వయసులో నాగేశ్వరమ్మని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నలుగురు సంతానం.
Gulte Telugu Telugu Political and Movie News Updates