Movie News

కాపీ అని చెప్పకనే చెప్పేశారు

ఇంగ్లిష్, కొరియన్, ఫ్రెంచ్ సహా వివిధ భాషల నుంచి మన వాళ్లు కథలు లేపుకొచ్చేసి సినిమాలు తీయడం కొత్తేమీ కాదు. ఒకప్పుడైతే వరల్డ్ సినిమాతో సామాన్య ప్రేక్షకులకు యాక్సెస్ తక్కువ ఉండేది కాబట్టి ఈ ‘ఫ్రీమేక్స్’ గురించి తెలిసేది కాదు కానీ.. గత కొన్నేళ్లలో ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని ప్రపంచ స్థాయిలో వివిధ భాషల్లో సినిమాలు చూసేస్తుండటంతో చిన్న సన్నివేశాన్ని కాపీ కొట్టినా పట్టేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే విదేశీ భాషా చిత్రాల మేకర్స్ నుంచి కూడా రీమేక్ హక్కులు కొని సినిమాలు తీస్తుండటం గమనించవచ్చు. ఊపిరి, ఓ బేబీ లాంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఒకవేళ హక్కులు తీసుకోకుండా కాపీ కొడుతున్నా.. ఆ విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు కొందరు ఫిలిం మేకర్స్. యువ దర్శకుడు సుధీర్ వర్మ ‘స్వామిరారా’తో అరంగేట్రం చేసినపుడు వివిధ భాషా చిత్రాలు.. ఫిలిం మేకర్స్ నుంచి తాను స్ఫూర్తి పొందిన విషయాన్ని టైటిల్స్‌లోనే ప్రకటించాడు.

తాజాగా హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అద్భుతం’ సినిమా విషయంలోనూ మేకర్స్ ఇలాంటి ప్రకటనే చేశారు. ప్రపంచంలో వచ్చిన అనేక సైన్స్ ఫిక్షన్ సినిమాల స్ఫూర్తితో ఈ కథ తీర్చిదిద్దామని ప్రకటించారు. ఈ సినిమాకు కథ అందించింది యువ ప్రశాంత్ వర్మ కావడం విశేషం. అతడిపై హాలీవుడ్ సినిమాల ప్రభావం బాగానే కనిపిస్తుంటుంది. ‘అద్భుతం’ విషయానికి వస్తే అతను కేవలం స్ఫూర్తి పొందలేదు. కొరియన్ మూవీ ‘కాల్’ని కాపీ కొట్టేశాడని చెప్పొచ్చు. ఆ సినిమా కథను చాలా వరకు అలాగే దించేశాడు.

నిజానికి వేర్వేరు కాలాల్లోని వ్యక్తులు ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యే నేపథ్యంలో సాగే ‘కాల్’ స్ఫూర్తితో ఇప్పటికే తెలుగులో ఓ సినిమా వచ్చింది. అదే.. ప్లేబ్యాక్. ఇప్పుడు అదే కథతో ‘అద్భుతం’ తీశారు. కాకపోతే ‘ప్లే బ్యాక్’తో పోలిస్తే దీనికి మోడర్న్ టచ్ ఇచ్చారు. ఆల్రెడీ ఇదే కాన్సెప్టుతో ‘ప్లే బ్యాక్’ చూడటం వల్ల ‘అద్భుతం’ సర్‌ప్రైజింగ్‌గా ఏమీ అనిపించట్లేదు. కథనం కూడా అంత ఆసక్తికరంగా లేకపోయింది. దీంతో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి అంత గొప్ప స్పందనేమీ కనిపించడం లేదు.

This post was last modified on November 19, 2021 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

17 minutes ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

8 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

12 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

12 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

12 hours ago