మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ఈపాటికే విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి రావాలనుకున్న ఈ సినిమా రాజీ పడి ఫిబ్రవరి 4న విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు అధికార ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో కొందరు హీరోలు చిరు సినిమాకి వారం గ్యాప్ ఇచ్చి తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు.
కానీ ఇప్పుడు ఓ హీరో చిరుతో పోటీకి దిగుతున్నారు. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్ సూర్య. గత రెండేళ్లుగా సూర్య నటిస్తోన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అలా విడుదలైన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఈసారి మాత్రం సూర్య థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేయడం లేదు. తన కొత్త సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తానని అధికారికంగా ప్రకటించారు సూర్య.
ప్రస్తుతం ఆయన ‘ఇతరుక్కుమ్ తునిందవన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఫిబ్రవరి 4న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సూర్య సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి తెలుగు మార్కెట్ లో ఆయన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. మరి ఈ హీరో అంత రిస్క్ చేస్తాడా..? లేక తన సినిమాను వాయిదా వేసుకుంటాడో చూడాలి!
This post was last modified on November 19, 2021 5:39 pm
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…