‘118’తో చాన్నాళ్ల తర్వత మంచి హిట్ కొట్టి.. ఆ తర్వాత ‘ఎంతమంచి వాడవురా’ సినిమాతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఆ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ అయితే తీసుకున్నాడు కానీ.. ఎగ్జైటింగ్ ప్రాజెక్టులను లైన్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తున్నాడు కళ్యాణ్. అతను చడీచప్పుడు లేకుండా ఒక భారీ చిత్రాన్ని మొదలుపెట్టి.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తవుతున్న దశలో దాని గురించి ప్రకటన చేశాడు. ఆ చిత్రమే.. బింబిసార.
కళ్యాణ్ రామ్ చేసిన తొలి పీరియాడిక్ మూవీ ఇది. ఇందులో కొంచెం జానపద ఛాయలు కూడా కనిపిస్తున్నాయి. మల్లిడి వశిష్ట్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ‘యన్.టి.ఆర్ ఆర్ట్స్‌లో అతడి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
కొన్ని నెలల కిందట ఉన్నట్లుండి ‘బింబిసార’ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఈ చిత్రం వార్తల్లో లేదు. ఐతే ఈ సినిమాను సైలెంటుగా విడుదలకు సిద్ధం చేస్తున్నారని.. డిసెంబరులోనే ఈ చిత్రం బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోందని సమాచారం.
ఈ నెల మొదటి వారంలో బాలయ్య సినిమా ‘అఖండ’ రానుండగా.. క్రిస్మస్ ముందు వారం ‘పుష్ప’ లాంటి భారీ చిత్రం విడుదల కాబోతోంది. క్రిస్మస్ వారాంతంలో ‘శ్యామ్ సింగరాయ్’, ‘గని’ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇలాంటి రిస్కీ సినిమాను పండుగ బరిలో నిలిపితే బాగుంటుంది కానీ.. క్రిస్మస్‌కు ఆల్రెడీ క్రౌడ్ ఎక్కువైంది. కాబట్టి ‘గని’ వదులుకున్న డిసెంబరు 10వ తేదీ మీద ‘బింబిసార’ పడొచ్చు. అదే రోజు ‘గుడ్ లక్ సఖి’ రానున్నప్పటికీ దాని వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. చూడాలి మరి కళ్యాణ్ రామ్ ఎక్కడ దూరుతాడో?
This post was last modified on November 18, 2021 3:32 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…