కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. డివోర్స్ తరువాత ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘పిట్టకథలు’, ఆహాలో ‘కుడి ఎడమైతే’ వంటి వెబ్ డ్రామాల్లో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమలా.. ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు.
రీసెంట్ గా సీనియర్ హీరో నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వస్తే.. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఆ ప్రాజెక్ట్ కూడా వదులుకుందని సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమాలో ముందుగా కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో అమలాపాల్ ని తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఆమెని సంప్రదిస్తే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆమెకున్న మార్కెట్ ని మించి అడగడంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారట. అమలాపాల్ ఫైనల్ కాకపోవడంతో చాలా మంది తారలను సంప్రదించారు. వారిలో మెహ్రీన్ కూడా ఉందట. ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. సీనియర్ హీరో కాబట్టి అంత ఇవ్వాలసిందేనని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికైతే.. అమలాపాల్, మెహ్రీన్ లను మాత్రం ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.
This post was last modified on November 17, 2021 8:43 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…