కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ నటించిన ‘పుష్పక విమానం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఈ సినిమాను నిర్మించడంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేశారు. సినిమా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ అవ్వలేకపోయింది. కానీ సినిమాలో మెయిన్ పాయింట్ చాలా బాగుందని అందరూ పొగిడారు. క్రైమ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అది కూడా బాలీవుడ్ లో కావడం విశేషం. హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. బాలీవుడ్ కి చెందిన మూడు నిర్మాణ సంస్థలు ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారట. నిజానికి బాలీవుడ్ లో ఇలాంటి కథలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
చర్చలు జరిపిన తరువాత ఎవరైతే మంచి డీల్ ఆఫర్ చేస్తారో వాళ్లకు రీమేక్ హక్కులు ఇచ్చేస్తారట. ఏ సంస్థకు హక్కులు అమ్మామనే విషయాన్ని త్వరలోనే చెబుతామని ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్లలో నడుతోంది. దామోదర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గీత్, మేఘన హీరోయిన్లుగా నటించారు.
This post was last modified on November 17, 2021 6:20 pm
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…