2022 సంక్రాంతికి నభూతో అనిపించే బాక్సాఫీస్ సమరాన్ని చూడబోతున్నాం. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రానికి తోడు ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి కొట్లాటకు సిద్ధమయ్యాయి. ‘భీమ్లా నాయక్’ విషయంలో నిన్నటి దాకా ఉన్న సస్పెన్స్‌కు ఈ రోజు తెరపడిపోయింది. ఆ చిత్రాన్ని జనవరి 12కే ఖరారు చేస్తూ ఈ రోజు అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు. ఇక డేట్ల మార్పు లాంటిదేమీ ఉండదని స్పష్టమైపోయింది. ఆల్రెడీ ‘భీమ్లా నాయక్’ కోసం థియేటర్ల బుకింగ్స్ కూడా జోరుగా జరుగుతున్నాయి.
ఐతే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి రెండు భారీ చిత్రాలకు డేట్లు సర్దుబాటు చేయడమే కష్టం. అలాంటిది ‘భీమ్లా నాయక్’ కూడా తోడవుతుండటంతో థియేటర్ల విషయంలో కచ్చితంగా తలనొప్పులు తప్పవు. కాబట్టి నాలుగో సినిమాకు అస్సలు ఛాన్స్ లేనట్లే.
ఐతే అక్కినేని నాగార్జున మాత్రం తన కొత్త చిత్రం ‘బంగార్రాజు’ను సంక్రాంతి రేసులో నిలిపే ఉద్దేశంతో చకచకా షూటింగ్ అవగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా టాకీ పార్ట్ అంతా పూర్తయిపోతుందట. తర్వాత పాటలు చిత్రీకరించి డిసెంబరు చివరికల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. సంక్రాంతికి భారీ చిత్రాలు రేసులో ఉన్నప్పటికీ ఆ పండక్కి పక్కాగా సూటయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తమదని.. తక్కువ సంఖ్యలో థియేటర్లు దొరికినా మంచి వసూళ్లు వస్తాయని.. లాంగ్ రన్ ఉంటుందని నాగ్ అంచనా వేశాడు.
కానీ ‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరిలో ఉండదన్న ధీమాతోనే ఆయన తన సినిమాను పండుగ రేసులోకి తెచ్చాడు. కానీ ‘భీమ్లా నాయక్’ తగ్గలేదు. పండక్కే వస్తోంది. ఇప్పుడు రేసులో ఉన్న మూడు భారీ చిత్రాలకే థియేటర్ల సర్దుబాటు చాలా కష్టంగా కనిపిస్తోంది. ఈ విషయంలో రాబోయే రోజుల్లో గొడవలు తప్పేలా లేవు. అలాంటిది ‘బంగార్రాజు’కు కనీస స్థాయిలో థియేటర్లు సర్దుబాటు చేయాలన్నా కష్టమే. కాబట్టి నాగ్ రేసులోంచి తప్పుకోవడం లాంఛనమే అని భావిస్తున్నారు.
This post was last modified on November 16, 2021 10:42 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…