దాదాపు పుష్కర కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంది సమంత. ఇన్నేళ్లలో ఆమె ఎప్పుడూ ఐటెం సాంగ్ చేసిందే లేదు. ఒకప్పట్లా స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేయడమేంటి అనుకునే పరిస్థితి గత కొన్నేళ్లలో బాగా మారిపోయింది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో దాదాపు అందరూ ఐటెం సాంగ్స్ చేసిన వాళ్లే. అనుష్క, తమన్నా, కాజల్, శ్రుతి హాసన్.. ఇలా ఈ జాబితాలో చాామందే కనిపిస్తారు. కానీ సమంత మాత్రం ఎందుకో ఒక్క సినిమాలోనూ ఐటెం నంబర్ చేయలేదు.
ఆమెకు ఎవరూ ఈ పాటలు ఆఫర్ చేయలేదో లేక సమంతనే అవి వద్దనుకుందో తెలియదు కానీ.. ఎప్పడూ వాటి జోలికి వెళ్లలేదు. సామ్ ఇంకెప్పటికీ అలాంటి పాటల్లో నటించదనే అంతా అనుకున్నారు. పెళ్లి కాకముందు, గ్లామర్ రోల్స్ చేస్తున్నపుడే ఐటెం నంబర్స్ చేయని సామ్.. పెళ్లి తర్వాత, గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరం అయిన నేపథ్యంలో ఇక అలాంటి పాటల్లో కనిపిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ గత కొన్ని నెలల్లో వేగంగా పరిస్థితులు మారిపోయాయి. ఆమె పెళ్లి విఫలమైంది. నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత.. సినిమాల విషయంలో రూల్స్ మార్చేసింది. ఉన్నట్లుండి వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది.
ఇప్పుడిక మళ్లీ గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా ఆమె రెడీ అయినట్లు తెలుస్తోంది. బోల్డ్ క్యారెక్టర్లకు కూడా ఓకే చెప్పేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప’లో ఐటెం సాంగ్ చేయడానికి కూడా ఆమె ఓకే చెప్పేసింది. ఐటెం సాంగ్ అంటే ఎంతో కొంత అందాల విందు చేయాల్సిందే. సెక్సీగా కనిపించాల్సిందే. ఇక తనకు ఏ బంధనాలూ లేవని, స్వేచ్ఛగా ఎలాంటి పాత్రలైనా చేయడానికి అవకాశం దొరికిందని పరోక్షంగా చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుంది సామ్. ఈ పాట చూశాక ఆమెకు ఫిలిం మేకర్స్ గ్లామర్, బోల్డ్ రోల్స్ బాగానే ఆఫర్ చేస్తారేమో.
This post was last modified on November 16, 2021 2:15 pm
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…