ఒకప్పుడు ఒక సినిమాకు ఒక రిలీజ్ డేట్ ఇచ్చారంటే పక్కాగా ఆ డేట్‌కు సినిమాను దించేసేవాళ్లు. ప్లానింగ్‌లో తేడా వచ్చేది కాదు. ఏవో కొన్ని సినిమాలకు మాత్రమే సమయానికి వర్క్ పూర్తి కాక, ఇంకేదో కారణంతో డేట్ మార్చాల్సి వచ్చేది. సినిమాను వాయిదా వేయడానికి, రిలీజ్ డేట్ మార్చడానికి చాలా ఇబ్బంది పడిపోయేవారు. అభిమానులు కూడా ఇలా డేట్లు మారిస్తే నిరాశ చెందేవాళ్లు. కానీ కరోనా పుణ్యమా అని లెక్కలన్నీ మారిపోయాయి.
ఒక డేట్ ఇవ్వడం.. తర్వాత సినిమాను వాయిదా వేయడం.. ఇంకోసారి కూడా డేట్ మార్చడం.. ఇలాంటి అనుభవాలు చాలా సినిమాల విషయంలో చూశాం. అంతటి అనిశ్చిత వాతావరణాన్ని తీసుకొచ్చింది కరోనా మహమ్మారి. కరోనా ప్రభావం తగ్గాక కూడా వేరే కారణాలతో డేట్లు మార్చడం జరుగుతూనే ఉంది. పెద్ద పెద్ద సినిమల విషయంలోనూ ఈ పరిస్థితి చూస్తున్నాం. ఇక చిన్న సినిమాల సంగతి చెప్పేదేముంది?
కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి సైతం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. కొన్ని నెలల పాటు అసలు వార్తల్లోనే లేని ఆ చిత్రం ఈ మధ్యే రిలీజ్ డేట్ ప్రకటనతో జనాల నోళ్లలో కాస్త నానింది. ఈ చిత్రాన్ని నవంబరు 26న రిలీజ్ చేయబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే ప్రకటించారు. కానీ డేట్ దగ్గరపడ్డా ప్రమోషన్లు చేయని చిత్ర బృందం.. ఇప్పుడు వాయిదా వార్తతో మీడియాలోకి వచ్చింది.
టైమింగ్, థియేటర్ల సమస్య, ఇతర కారణాల వల్ల ఈ సినిమాను నవంబరు 26 నుంచి డిసెంబరు 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి ఆ డేట్‌కు వరుణ్ తేజ్ మూవీ గని రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని డిసెంబరు 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వాళ్లిలా డేట్ మార్చుకున్నారో లేదో గుడ్ లక్ సఖిని డిసెంబరు 10కి ఫిక్స్ చేస్తూ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మరి ఆ డేట్‌కైనా సినిమా వస్తుందో లేదో చూడాలి.
This post was last modified on November 16, 2021 1:40 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…