అందం, టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం మాత్రం అంతంతమాత్రమే ఈషా రెబ్బకి. ఎన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. చెప్పుకోదగ్గ అవకాశాలూ అంతగా రావడం లేదు. దాంతో వెబ్ సిరీసుల వైపు అడుగేసింది. రీసెంట్‌గా మారుతి ‘త్రీరోజెస్’లో ఒక బోల్డ్ బేబీగా కనిపించింది మురిపించింది. ఇప్పుడు ఓ ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో ‘ధమాకా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. దాన్ని మొదట అనసూయతో చేయించాలనుకున్నారు. కానీ ఆమె ఆల్రెడీ ‘ఖిలాడి’లో ఓ కీలక పాత్ర చేసింది. దాంతో ఈ కాంబో పెద్ద కిక్కివ్వదని మేకర్స్ అనుకున్నారట.
ఆ తర్వాత పాయల్ రాజ్‌పుత్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె కూడా ఇప్పటికే ‘డిస్కో రాజా’ మూవీలో మాస్ మహారాజాతో జోడీ కట్టింది. వారి పెయిర్‌కి పెద్దగా పేరు రాలేదు. కాబట్టి మరోసారి రిపీట్ చేయడం అనవసరం అనిపించి ఆ ఆలోచనను కూడా మార్చుకున్నారట. చివరికి ఈషా రెబ్బా అయితే బాగుంటుందని, ఇప్పటి వరకు ఆమె ఐటమ్ సాంగ్ చేయలేదు కాబట్టి ఫ్రెష్ ఫీల్ వస్తుందని ఫీలవుతున్నారట. దాదాపు కన్‌ఫర్మ్ చేసినట్టే అంటున్నారు.
అచ్చ తెలుగు అమ్మాయే అయినా అందాల విందు చేయడానికి ఎప్పుడూ సంకోచించదు ఈషా. సినిమాల్లో డీసెంట్ రోల్సే చేసినా వెబ్ సిరీసుల్లో హాట్ హాట్‌గా అదరగొడుతోంది. సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచి నెటిజన్స్‌ని ఆకట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశం వస్తే తన బెస్ట్ ఇవ్వడానికి కచ్చితంగా ట్రై చేస్తుంది. సో ఆమెకి ఆఫర్ చేయడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఇంతవరకు ఏదీ అచ్చిరాని ఈషాకి ఈ అవకాశమైనా హెల్పవుతుందో లేదో చూడాలి.
This post was last modified on November 15, 2021 11:28 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…