టాలీవుడ్లో పూజా హెగ్డే.. కోలీవుడ్లో పూజా హెగ్డే.. బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే.. ఇండియా మూడు మేజర్ ఫిలిం ఇండస్ట్రీల్లో ఈ ముంబయి భామదే హవా. వరుసగా భారీ విజయాలందుకుంటూ.. సినిమా సినిమాకూ క్రేజ్, ఫాలోయింగ్ పెంచుకుంటూ తనకు ఎదురు లేదని చాటుతోంది పూజా. ఇటీవల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ లాంటి యావరేజ్ మూవీ కూడా హిట్ అయిందంటే అందుకు ముఖ్య కారణం పూజానే. దీని కంటే ముందు ఆమె అందుకున్న భారీ విజయాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ప్రస్తుతం తెలుగులో ఆమె నటించిన రాధేశ్యామ్, ఆచార్య లాంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సరసన ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయబోతోంది. తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ లాంటి భారీ చిత్రంలో నటిస్తోంది. హిందీలో ‘సర్కస్’ అనే పెద్ద సినిమాలో ఆమే కథానాయిక.
వివిధ భాషల్లో ఇలా తీరిక లేకుండా నటిస్తున్న పూజా.. లేక లేక విరామం తీసుకుంది. సేదదీరేందుకు మాల్దీవులకు వెళ్లిపోయింది. తోడుగా ఎవరెళ్లారో ఏంటో కానీ.. పూజా మాత్రం అక్కడ భలేగా ఎంజాయ్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తన ఫొటోలు, వీడియోలే అందుకు నిదర్శనం. బికినీ వేసుకుని చాలా సెక్సీగా కనిపిస్తూ వాటర్లో డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పూజానే స్వయంగా షేర్ చేసింది. ఇలాంటి అసాధారణమైన అనుభవాలను ఆస్వాదిస్తున్న సాధారణ అమ్మాయి తాను అని ఆమె కామెంట్ కూడా పెట్టింది.
ఇక బికినీలో ఒక రిసార్ట్ ముందు పూజా స్టెప్పులేస్తున్న చిన్న వీడియో ఒకటి ట్విట్టర్లో తెగ తిరిగేస్తోంది. అందులో పూజా సూపర్ సెక్సీగా కనిపిస్తోంది. కరోనా టైంలో ఇలా హీరోయిన్లు చాలామంది మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేసిన వాళ్లే. అక్కడి రిసార్టులు సెలబ్రెటీలకు హాలిడే ప్యాకేజీలను ఉచితంగా ఆఫర్ చేసి.. వాళ్ల ప్రమోషన్‌తో పర్యాటకులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 15, 2021 10:37 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…