ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా వారిపై చీటింగ్ కేసు నమోదైంది. ముంబైకి చెందిన నితిన్ బరాయ్ అనే వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా దంపతులతో పాటు మరికొంతమందిపై ఈ కేసు పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా మొదలుపెట్టిన ఫిట్నెస్ ఎంటర్ప్రైజెస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇందులో భాగంగా తన దగ్గర నుంచి 1.51 కోట్ల రూపాయలను తీసుకున్నారని.. డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరిస్తున్నారని ఆ వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు అధికారులు.
అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూలై 19 నుంచి అతడిని కష్టడీలోనే ఉంచారు. పలుమార్లు బెయిల్ కి అప్లై చేసుకున్నా.. రిజెక్ట్ అయింది. ఫైనల్ గా ముంబై కోర్టు రీసెంట్ గా బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చారు. రాజ్‌కుంద్రా నేరం చేసినట్లు రుజువైతే గనుక అతడికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది.
This post was last modified on November 14, 2021 3:02 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…