ఇంతకుముందు ఫిబ్రవరి రెండో సగం.. మార్చి ప్రథమార్ధం అంటేనే అన్ సీజన్ అనుకునేవాళ్లు. ఆ టైంలో మామూలుగా విద్యార్థులకు పరీక్షలుంటాయి. వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు రావు. అందుకే ఆ టైంలో పెద్దగా వసూళ్లు ఉండవు. కాబట్టే పేరున్న సినిమాలను ఆ టైంలో రిలీజ్ చేయరు.
కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఉప్పెన, జాతిరత్నాలు సినిమాలు వసూళ్ల మోత మోగించాయి. వచ్చే ఏడాది ఈ రెండు నెలల్లోనే ఆచార్య, ఎఫ్-3, ఖిలాడి, మేజర్ లాంటి క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఫిబ్రవరి, మార్చి నెలల విషయంలో ఇలా అభిప్రాయాలు మారిపోతుండగా.. నవంబరేమో అస్సలు సినిమాలకు అచ్చిరాని నెలగా మారిపోతోంది. కొన్నేళ్లుగా ఈ నెలలో రిలీజవుతున్న సినిమాలేవీ సరిగా ఆడటం లేదు. ఈ ఏడాది కూడా నవంబరు డల్లుగా మారిపోయింది.
గత నెలలో దసరా సినిమాలే కాక వేరేవి కూడా సందడి చేశాయి. వచ్చే నెలలో ఎలాగూ భారీ చిత్రాల సందడి ఉంది. కానీ మధ్యలో నవంబరే ఎటూ కాకుండా తయారైంది. దీపావళి కానుకగా వచ్చిన సినిమాల్లో ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మంచి రోజులు వచ్చాయితో పాటు తమిళ అనువాదాలు పెద్దన్న, ఎనిమీ నిరాశ పరిచాయి.
ఇక ఈ వారం సినిమాలపై ప్రేక్షకులకు ఏమంత ఆసక్తి లేదని వాటికి వచ్చిన డల్ ఓపెనింగ్స్‌ను బట్టి అర్థమవుతోంది. పుష్పక విమానం, రాజా విక్రమార్క, కురుప్.. ఈ మూడు చిత్రాల్లో దేనికీ మంచి టాక్ రాలేదు. ఇక వచ్చే వారం అయితే బాక్సాఫీస్ వెలవెలబోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఊరూ పేరూ లేని.. చిన్నా చితకా సినిమాలు తప్ప పేరున్న సినిమాలేవీ వచ్చే వారానికి షెడ్యూల్ కాలేదు. ఇక నవంబరు చివరి వారంలో గుడ్ లక్ సఖి, అనుభవించు రాజా రావాల్సి ఉంది. అవీ చిన్న స్థాయి సినిమాలే. వాటిపై అంచనాలూ తక్కువే. మొత్తానికి నవంబరులో బాక్సాఫీస్ పూర్తిగా డల్ అయినట్లే కనిపిస్తోంది. డిసెంబరు మొదటి వారంలో అఖండ వస్తే కానీ మళ్లీ బాక్సాఫీస్‌లో వేడి పుట్టేలా లేదు.
This post was last modified on November 14, 2021 11:18 am
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…