Movie News

బాలయ్య మూడో ఎపిసోడ్.. పేలిపోయేదే

నందమూరి బాలకృష్ణను ఒక టాక్ షోలో హోస్ట్‌గా చూస్తామని ఎవ్వరూ ఊహించి ఉండరు. అందులోనూ అది అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆహా కోసం అయ్యుంటుందని అసలే అంచనా వేసి ఉండరు. కానీ ఈ అనుకోని కలయిక సాధ్యమైంది. ‘అన్‌స్టాపబుల్’ పేరుతో బాలయ్య చేస్తున్న టాక్ షో దీపావళికే మొదలైంది. మంచు ఫ్యామిలీ పాల్గొన్న ఈ ఎపిసోడ్‌కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. రెండో ఎపిసోడ్లో నేచురల్ స్టార్ నాని పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సంబంధించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఈ షో వల్ల ‘ఆహా’ సబ్‌స్క్రైబర్లు చెప్పకోదగ్గ సంఖ్యలోనే పెరిగినట్లుగా తెలుస్తోంది. వ్యూయర్ షిప్ ఒక రేంజ్‌లో ఉందంటున్నారు. తొలి సీజన్ అంతా క్రేజీ గెస్టులతో చాలా హుషారుగా ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం మూడో ఎపిసోడ్ గెస్ట్ కూడా ఖరారయ్యారు. ఆ గెస్ట్ కూడా చాలా స్పెషలే.

యూత్‌లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో సందడి చేయబోతున్నాడట. బాలయ్యతో విజయ్‌కి మంచి అనుబంధమే ఉంది. బాలయ్యకు సన్నిహితుడైన పూరి జగన్నాథ్‌తో ప్రస్తుతం విజయ్ ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య బాలయ్య.. ‘లైగర్’ సెట్స్‌కు వెళ్లాడు కూడా.

విజయ్ ఏ వేడుకలో పాల్గొన్నా.. ఏ షోలో అడుగు పెట్టినా అక్కడి వాతావరణాన్నే మార్చేస్తాడు. తనదైన వ్యాఖ్యలతో, చేష్టలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తాడు. అలాంటివాడు బాలయ్య షోలో పాల్గొంటే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు. బయట మామూలుగా మాట్లాడేటపుడు బాగా తడబడే బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షోలో మాత్రం ఏ తడబాటు లేకుండా సాగిపోతున్నాడు. హుషారుగా షోను నడిపిస్తున్నాడు.

ఇందులో ఓ కొత్త బాలయ్య కనిపిస్తున్నాడు అభిమానులకు. తొలి రెండు ఎపిసోడ్లలో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య.. విజయ్‌తో కలిసి సందడి చేస్తే ఆ ఎపిసోడ్‌కు రెస్పాన్స్ ఒక రేంజిలో ఉంటుందనడంలో సందేహం లేదు.

This post was last modified on November 13, 2021 2:11 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

2 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

2 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

3 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

3 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

4 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

4 hours ago