‘సైరా’లో మెగాస్టార్‌తో కలిసి నటించిన తమన్నా ఇప్పుడు మరోసారి ఆయన సరసన మెరిసే చాన్స్ కొట్టేసింది. మెహెర్ రమేష్ తెరకెక్కిస్తున్న ‘భోళాశంకర్’లో తనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తమన్నాని ఆకాశానికి ఎత్తేశాడు మెహెర్.
‘కథ చెప్పేటప్పుడే మా సినిమాలో హీరోయిన్ తమన్నాయే అని అందరికీ చెప్పేశాను. ఇప్పుడు తను చాలా బిజీగా ఉంది. ఎన్నో సినిమాలు చేస్తోంది. అయినా కూడా మా సినిమాకి ఎలాగైనా డేట్స్ ఇవ్వమని అడిగాను. అవసరమైతే ఆమె చేస్తున్న ప్రాజెక్టుల ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లి నేనే రిక్వెస్ట్ చేస్తానని కూడా చెప్పాడు. చివరికి ఓకే అంది. తమన్నా ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ ఓ రేంజ్‌లో చెప్పుకొచ్చాడు మెహెర్. ఆయన మాటలు విన్నవాళ్లకి కాస్త ఆశ్చర్యంగానే అనిపించింది.
‘బాహుబలి’ తర్వాత స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాలు అంతంతమాత్రంగానే వచ్చాయి తమన్నాకి. ఎఫ్3, సైరా తప్ప మిగతావన్నీ ఓ మాదిరి సినిమాలే. పైగా వాటిలో ఎక్కువ ఫెయిల్యూర్సే. కాకపోతే వరుసగా ఏదో ఒక సినిమా అయితే చేస్తూ వచ్చింది. అలా అని డేట్స్ దొరకనంత బిజీగా ఉందా అంటే లేదనే చెప్పాలి. హిందీలో ‘బోలె చూడియా’ అనే సినిమాకి కమిటయ్యింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తైపోయింది. ప్రస్తుతం అక్కడ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ ఒక్కటే చేస్తోంది.
ఇక తెలుగులో ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం సినిమాలు మాత్రమే చేతిలో ఉన్నాయి. తను కమిటైన ఒకే ఒక్క టీవీ షో ‘మాస్టర్ చెఫ్’ కూడా ఈమధ్యనే చేజారిపోయింది. కాబట్టి చిరంజీవి సినిమాకి డేట్స్ ఇవ్వలేనంత బిజీయేమీ కాదామె. అందులోనూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి సినిమా తన బ్యాగ్‌లో పడటం అదృష్టమనే చెప్పాలి. మరి తమన్నా డేట్స్ కోసం అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఏంటో.
This post was last modified on November 12, 2021 7:08 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…