అక్కినేని నాగార్జున నటిస్తోన్న ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టారు. అప్పుడే షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. పక్కా ప్లాన్ తో షూటింగ్ మొదలు పెట్టడంతో అనుకున్నట్లుగానే త్వరగా సినిమాను పూర్తి చేయబోతున్నారు. అంతేకాదు.. 2022 సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఉందని తెలిసి కూడా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు.
కొన్నేళ్లుగా నాగార్జున ట్రాక్ రికార్డ్ చూస్తే గనుక సరైన సక్సెస్ రాలేదు. అయినప్పటికీ నాగ్ ఎందుకు పోటీకి దిగుతున్నాడో తెలుసా..? ‘బంగార్రాజు’ సినిమాకి మొత్తం ఫండింగ్ చేసింది జీ స్టూడియో సంస్థ. చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమాను జనవరిలో విడుదల చేయాలి. జనవరి నెల మొత్తంలో ఎప్పుడైనా సినిమాను రిలీజ్ చేసుకోవచ్చు.. అలా కాకుండా ఫిబ్రవరికి వెళ్తే ఒప్పుకున్న మొత్తంలో కనీసం 15 శాతం అమౌంట్ ను కట్ చేస్తారట.
అందుకే నాగార్జున ఎట్టి పరిస్థితుల్లో సినిమాను జనవరిలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాలు మాత్రమే విడుదలైతే నాగార్జున సంక్రాంతికి తన సినిమాను కూడా రిలీజ్ చేస్తారు. వాటితో పాటు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వస్తే గనుక జనవరి నెలాఖరున ‘బంగార్రాజు’ని రిలీజ్ చేస్తారట. అందుకే ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా షురూ చేశారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగానే.. తన సినిమా డేట్ ను ప్రకటించడానికి రెడీగా ఉన్నారు నాగార్జున.
This post was last modified on November 12, 2021 1:48 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…