దక్షిణాది సినిమా స్థాయిని పెంచిన నటుల్లో ముందు కమల్ హాసన్ పేరు చెప్పుకోవాలి. ఇక దర్శకుల్లో అలాంటి ఒక స్థాయిని ఏర్పరుచుకున్న వాడు శంకర్. ఈ ఇద్దరితోనూ వేర్వేరుగా సినిమాలు చేయాలని ప్రతి హీరోయిన్ ఆశిస్తుంది. కానీ వీళ్లిద్దరితో ఒకేసారి సినిమా చేసే అరుదైన అవకాశం అందుకుంది కాజల్ అగర్వాల్. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అందులోనూ కెరీర్ చరమాంకంలో ఇలాంటి అవకాశం వచ్చినందుకు కాజల్ ఎంత సంబరపడిందో. కానీ ఆ సంబరం ఇప్పుడు నైరాశ్యంగా మారేలా కనిపిస్తోంది.
ఆమె కమల్ హాసన్-శంకర్‌ల కలయికలో తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ సినిమా షూటింగ్ 60 శాతానికి పైగా పూర్తయ్యాక వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా కోసం కాజల్ మీద చాలా సన్నివేశాలే తీశారు. కానీ క్రేన్ ప్రమాదం వల్ల దాదాపు రెండేళ్ల కిందట ఆగిన సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. ఇందుకు కారణాలు అనేకం.
తన డేట్లన్నీ వృథా అయినప్పటికీ.. ఈ సినిమా తనకు ఎంతో ప్రతిష్ఠాత్మకం కావడంతో సినిమా ఎప్పుడు పున:ప్రారంభం అవుతుందా అని ఓపిగ్గా ఎదురు చూసింది కాజల్. కానీ అలాంటి సంకేతాలే కనిపించకపోవడంతో పెళ్లికి రెడీ అయిపోయింది. పెళ్లయి కూడా ఏడాది పూర్తయింది. చేతిలో ఉన్న వేరే ప్రాజెక్టులు పూర్తి కావడం, ‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేలకపోవడంతో కాజల్ బిడ్డను కనేందుకు రెడీ అయింది. ఆమె ప్రెగ్నెంట్ అయి కొన్ని నెలలు గడిచినట్లుగా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.
కమల్ ‘విక్రమ్’ సినిమాను పూర్తి చేయగానే ఈ సినిమాను మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆ టైంలో కాజల్ అయితే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇంత భారీ ప్రాజెక్టు పున:ప్రారంభం అవుతుంటే కేవలం కాజల్ కోసం ఆగుతారా అన్నది డౌట్. ఆమెకు రీప్లేస్మెంట్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఈ సినిమా కోసం కాజల్ పడ్డ కష్టమంతా వృథా అయినట్లే. తన పారితోషకం తనకొచ్చేయొచ్చు కానీ.. ఎంతో ఎగ్జైట్మెంట్‌తో చేసిన సినిమా నుంచి ఇలా తప్పుకోవాల్సి రావడం.. కమల్‌కు జోడీగా, శంకర్ దర్శకత్వంలో నటించిన సీన్లన్నింటినీ తీసి పక్కన పడేస్తుంటే ఎంత బాధ కలుగుతుందో చెప్పేదేముంది?
This post was last modified on November 12, 2021 7:09 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…