పుష్ప సినిమా నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసినపుడల్లా.. ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూస్తున్నారు. అల్లు అర్జున్‌తో మొదలుపెడితే రష్మిక మందన్నా, ఫాహద్ ఫాజిల్, ధనంజయ, సునీల్, అనసూయ.. ఇలా ప్రతి క్యారెక్టర్ లుక్ కూడా స్టన్నింగ్‌గానే అనిపిస్తోంది. వీరిలో ఏ నటుడు కూడా మామూలుగా కనిపించేలా ఈ సినిమాలో లేడు. వారిని ఒక స్టన్నింగ్, సర్ప్రైజ్ లుక్‌లోకి మార్చి.. వారెవా ఇదేం మేకోవర్ అనిపిస్తున్నాడు సుకుమార్.
మొదట బన్నీ లుక్ చూసే జనాలు షాకైపోయారు. ఫాహద్, సునీల్, అనసూయల లుక్స్ కూడా అంతే స్టన్నింగ్‌గా అనిపించాయి. సినిమా మీద అంచనాలు పెరగడానికి ఒక రకంగా ఈ లుక్స్ కూడా కారణమే. కాకపోతే ఈ లుక్స్ చూసినపుడల్లా లోలోన కొంచెం భయం కూడా కలుగుతోంది మన ప్రేక్షకులకు.
బేసిగ్గా తెలుగు సినిమా అంటే గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్. హీరో ఎంత అట్టుడుగు వర్గానికి చెందిన వాడైనా కూడా అందంగానే కనిపించాలన్నట్లుగా ఉంటుంది మనోళ్ల ఆలోచన. మామూలుగా ఇలాంటి రా అండ్ రస్టిక్ లుక్స్.. క్యారెక్టర్స్ ఎక్కువగా తమిళ సినిమాల్లోనే చూస్తుంటాం. సహజత్వం పేరుతో నటీనటుల్ని జీర్ణించుకోలేని లుక్స్‌లో చూపిస్తుంటారు తమిళ ఫిలిం మేకర్స్. అలాంటివి చూసి ఒకప్పుడు మనోళ్లు ఎబ్బెట్టుగా ఫీలయ్యేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో మన దగ్గర కూడా ఇలాంటి రా అండ్ రస్టిక్ ఫీల్ ఉన్న సినిమాలు కొన్ని వచ్చాయి. ‘రంగస్థలం’ ఆ కోవలోనిదే. ఆ సినిమా తీసిన సుకుమారే ఇప్పుడు ‘పుష్ప’ తీస్తున్నాడు.
కాకపోతే ‘రంగస్థలం’ ఇరగాడేసింది కదా అని.. సుకుమార్ ఈ ‘రా అండ్ రస్టిక్’ ఫీల్ విషయంలో ఎక్స్‌ట్రీమ్‌కు వెళ్లిపోతున్నాడేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదైనా సరే.. అతిగా చేస్తే జనాలకు ఎక్కదు. ‘రంగస్థలం’ ఆడింది కదా అని.. ‘పుష్ప’ పాత్రలు, వాటి లుక్స్ విషయంలో శ్రుతి మించి పోతే రేప్పొద్దున తెర మీద ఇంత ‘రానెస్’ను ‘డీగ్లామర్’ను తట్టుకోగలరో లేదో?
This post was last modified on November 10, 2021 6:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…