ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్లయిన ఈ తరం హీరోల లిస్టు తీస్తే టాప్-10 లిస్టులో టాలీవుడ్ తారలే ఎక్కువగా కనిపిస్తారు. హిందీలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, తమిళంలో విజయ్ కూడా మంచి డ్యాన్సర్లే కానీ.. మన స్టార్ల స్థాయిలో వాళ్లు ప్రతి సినిమాలో డ్యాన్సులతో అలరించరు. కొత్త కొత్త స్టెప్పులతో ఆశ్చర్యపరచరు. మన దగ్గర ఒకరో ఇద్దరో కాదు.. అరడజను మందికి పైగానే తిరుగులేని డ్యాన్సర్లున్నారు. వారిలో నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారులుగా చెప్పుకోదగ్గ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. వీరిలో ఎవరు మేటి అంటే చెప్పడం కష్టమే.
స్పీడ్, గ్రేస్, ఊర మాస్.. ఇలా డ్యాన్స్ పరంగా ఏం చూపించాలన్నా ఎవరికి వాళ్లే సాటి అన్నట్లుంటుంది వాళ్ల నృత్యం. ఇలాంటి గొప్ప డ్యాన్సర్లు ఇద్దరు కలిసి ఒక సినిమా చేయడం.. ఒక ఊర మాస్ పాటకు ఇద్దరూ కలిసి స్టెప్పులేయడం ఒక కలలాంటి విషయమే. ‘ఆర్ఆర్ఆర్’తో ఆ కల నిజం అయ్యింది.
చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఒక రేంజిలో ఉంటాయని ముందు నుంచే అంచనాలున్నాయి. కానీ ఇందులో హీరోలిద్దరూ వీర లెవెల్లో డ్యాన్స్ చేసే పాట ఉంటుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. అలాంటి ఆశ, అంచనా ఎవరికీ లేవు. కానీ ‘నాటు నాటు’ అనే పాటలో ఈ ఇద్దరికీ నాటు స్టెప్పులేసే అవకాశం దక్కింది.
ఈ పాట ప్రోమో రిలీజైనప్పటి నుంచి అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఇప్పుడు ఈ పాట ఫుల్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో అక్కడక్కడా ఇద్దరూ కలిసి మంచి సింక్రనైజేషన్లో, సూపర్ స్పీడ్‌తో డ్యాన్సులేసిన బిట్స్ చూపించారు. అవి చూస్తే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. ఉరుము, మెరుపు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేలా ఉందీ పాట. తారక్, చరణ్ ఎవరికి వారు సింగిల్‌గా డ్యాన్సులేస్తుంటేనే ఏదోలా ఉంటుంది. ఇక ఇద్దరూ కలిసి ఇలాంటి మాస్ పాటకు ఊర మాస్ స్టెప్పులేస్తే ఇక థియేటర్లు హోరెత్తిపోవడం ఖాయం.
This post was last modified on November 10, 2021 5:51 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…