Movie News

ఓరి దేవుడా.. దించేస్తున్నారుగా!

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్ సినిమాల లైనప్ బానే ఉంది. ప్రస్తుతం చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘ఓ మై కడవులే’ రీమేక్ ఒకటి. తమిళంలో తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తుయే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్‌లో అశోక్ సెల్వన్, రితికా సింగ్ చేసిన పాత్రల్లో విశ్వక్, మిథిలా పార్కర్ నటిస్తున్నారు. ఈ రీమేక్‌కి ‘ఓరి దేవుడా’ అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌‌ని కూడా తాజాగా విడుదల చేశారు. అప్పట్నుంచి కాస్త నెగిటివ్ కామెంట్స్ చక్కర్లు కొడుతున్నాయి.

ఎంత రీమేక్‌ అయితే మాత్రం.. ఇంతలా దించేయాలా అనేదే ముఖ్యమైన కామెంట్. అక్కడ ఓ మై కడవులే అని పెట్టారు కదా అని తెలుగులో ఓరి దేవుడా అని పెట్టడం అంత రుచించడం లేదు. తరచుగా అందరూ వాడే మాటే అయినా టైటిల్‌గా ఇది అంత యాప్ట్‌గా అనిపించడం లేదు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ అయితే మరీ దారుణం. తమిళ పోస్టర్‌‌ని మక్కీకి మక్కీ దించేశారు. దాంతో సినిమాని కూడా యాజిటీజ్ తీసేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.

వేరే భాషల్లో హిట్టయిన సినిమాలను తమ భాషలో రీమేక్ చేయడంలో తప్పేమీ లేదు. అయితే రీమేక్‌ అన్నారు కదా అని టైటిల్ దగ్గర్నుంచి ప్రతిదీ దించేస్తే వర్కవుట్ కాదని ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది. అందుకే రీమేక్‌ నుంచి ఫ్రీమేక్ స్టైల్‌కి వచ్చారు మేకర్స్. అక్కడ దబాంగ్ అంటే ఇక్కడ గబ్బర్ సింగ్ అన్నారు. అక్కడ లూసిఫర్ అంటే ఇక్కడ గాడ్ ఫాదర్ అంటున్నారు. ఇక్కడి నేటివిటీకి, యాక్టర్ల ఇమేజ్‌కి తగ్గట్టుగా టైటిల్ దగ్గర్నుంచి కాన్సెప్ట్ వరకు మార్పులు చేస్తేనే మన ఆడియెన్స్ కనెక్టవుతారు.

అలాంటిది విశ్వక్ సినిమాకి టైటిల్‌ని ట్రాన్స్‌లేట్ చేసి పెట్టడం, కనీసం పోస్టర్‌‌లో కూడా సొంత క్రియేటివిటీ వాడకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. పైగా ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాస్తున్నాడు. దిల్‌ రాజు, పీవీపీ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రేక్షకుల నాడి తెలిసిన ఇంతమంది కలిసి తీస్తున్న సినిమా కాబట్టి జనాలు కొత్తదనాన్ని ఆశించడంలో తప్పు లేదు కదా. కనీసం సినిమాలోనైనా అది కనిపిస్తుందేమో చూద్దాం.

This post was last modified on November 10, 2021 11:09 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

58 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

1 hour ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

4 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

6 hours ago