మహానటి లాంటి సినిమా చేసి.. ఓవైపు ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారి.. మరోవైపు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల పక్కన సైతం నటిస్తున్న కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలకు ఒప్పుకోవడం కొందరిని షాక్‌కి గురి చేసిన మాట వాస్తవం. ఎందుకు ఇలాంటి పాత్రలు ఒప్పుకుంటోంది, ఇలాగైతే తన రేంజ్ పడిపోతుంది, కెరీర్ దెబ్బ తింటుంది అని కొందరు బహిరంగంగానే కామెంట్స్ కూడా చేశారు. రేంజ్ సంగతేమో కానీ.. కమర్షియల్‌గా మాత్రం కీర్తికి బాగానే గిట్టుబాటవుతోంది.
రీసెంట్‌గా ‘పెద్దన్న’లో రజినీకాంత్‌కి చెల్లెలిగా కనిపించింది కీర్తి. కొత్తదనం లేని కథ, ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసేసిన సిస్టర్ సెంటిమెంట్ ఈ సినిమాని అనుకున్న స్థాయిలో నిలబెట్టలేదు. తమిళంలో రజినీకున్న క్రేజ్‌తో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత కూడా హవా కాస్త కంటిన్యూ అయ్యి కలెక్షన్స్ రాబట్టింది. అయితే రజినీ స్టార్డమ్‌కి అది చాలా తక్కువనే చెప్పాలి. ఇక తెలుగులో అయితే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమాత్రం ఆదరించలేకపోయారు. ఈ వయసులోనూ రజినీ ఎనర్జీ చూసి ముచ్చటపడినా, కీర్తిని ఆ ఏడుపుగొట్టు పాత్రలో చూడటానికి అస్సలు ఇష్టపడలేదు. అసలామె ఎందుకీ పాత్ర ఒప్పుకుందా అని ఫీలయ్యారు.
అయితే క్యారెక్టర్ పరంగా, సక్సెస్ పరంగా కీర్తికి కలిసి రాలేదేమో కానీ.. కమర్షియల్‌గా మాత్రం బాగానే గిట్టుబాటైనట్టు తెలుస్తోంది. ఆ పాత్ర చేయడానికి కీర్తికి రెండు కోట్ల రెమ్యునరేషన్ చెల్లించారట. ఇప్పుడు ‘భోళాశంకర్’లో చిరంజీవికి కూడా చెల్లెలిగా నటించబోతోంది కీర్తి. ఈ మూవీకి కూడా తనకి భారీ పారితోషికం చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అజిత్ ‘వేదాళం’కి రీమేక్ ఈ సినిమా. చెల్లెలి సెంటిమెంట్ ఉన్నప్పటికీ అది కథలో ఓ భాగంలా ఉంటుంది. అందుకే అక్కడ స్టార్ హీరోయిన్‌ని కాకుండా లక్ష్మీ మీనన్‌ని తీసుకున్నారు.
అలాంటి క్యారెక్టర్‌కి తెలుగులో కీర్తిని తీసుకున్నారంటేనే ఆ పాత్ర పరిధిని బాగా విస్తరిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్ కాబట్టి రెమ్యునరేషన్ కూడా ఆ రేంజ్‌లోనే ఇస్తారనడంలో సందేహం లేదు. అయితే జోడీ కట్టాల్సిన హీరోల చేతులకి ఇలా రాఖీలు కడుతూ పోతుంటే.. తర్వాత వారి పక్కన హీరోయిన్‌గా చాన్స్ దొరుకుతుందా అనేది డౌట్. ఎందుకంటే ‘ఉప్పెన’ తర్వాత కృతీశెట్టిని తన పక్కన హీరోయిన్‌గా తీసుకుంటుంటే విజయ్ సేతుపతి వద్దన్నాడు. కూతురిగా చూసిన అమ్మాయిని తనకి జోడీగా ఊహించుకోలేనన్నాడు. రేపు కీర్తి విషయంలోనూ ఇలాంటిది జరిగే చాన్స్ లేకపోలేదు.
This post was last modified on November 10, 2021 11:05 am
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…