టాలీవుడ్లో బెస్ట్ బాడీస్ ఉన్న హీరోల లిస్టు తీస్తే అందులో కార్తికేయ పేరు ముందు వరుసలో ఉంటుంది. బేసిగ్గానే అతడికి మంచి ఫిజిక్ ఉండగా.. బాగా కసరత్తులు చేసి దాన్నింకా మంచి షేప్‌లోకి తెచ్చుకున్నాడు. తాను హీరోగా ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నానంటే.. తనకిన్ని అవకాశాలు వచ్చాయంటే అందుకు బాడీ ఓ ముఖ్య కారణం అంటున్నాడు కార్తికేయ.
తన కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా అవకాశం కూడా తన బాడీ చూసే వచ్చిందని.. ఇంకో రెండు పెద్ద అవకాశాలకు కూడా బాడీనే కారణమైందని స్వయంగా కార్తికేయనే వెల్లడించడం విశేషం. తన కొత్త చిత్రం ‘కార్తికేయ’ ప్రమోషన్లలో భాగంగా మీడియా ఇంటర్వ్యూల్లో అతనీ విషయం పంచుకున్నాడు.
“నా బాడీ, ఫిజిక్ వల్లే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అజయ్ భూపతి నన్ను ఆ సినిమా కోసం అడిగినపుడు.. ‘సార్ నేను మీకు ఎలా తెలుసు నేను యాక్టింగ్ చేస్తానని’ అని అడిగాను. అందుకాయన బదులిస్తూ.. ‘అదంతా నాకు తెలియదు. నీకు బాడీ ఉందని తీసుకున్నాను. యాక్టింగ్ చేయించుకుందాం అనుకున్నాను. అంతే’ అన్నాడు. తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ అప్పుడు విక్రమ్ కుమార్ గారిని కూడా నన్నెందుకు తీసుకున్నారని అడిగాను. ఆయన కూడా నీకు మంచి బాడీ ఉందనే ఎంచుకున్నా అన్నారు.
ఇప్పుడు అజిత్ గారితో చేస్తున్న ‘వలిమై’ సినిమాలో ఛాన్స్ రావడానికి కూడా నా బాడీనే కారణం. ఐతే బాడీ ఉందని తీసుకున్న ముగ్గురు దర్శకులూ కూడా తర్వత నా నటనను చూసినపుడు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు చేసినపుడు నటనలోని ఇంటెన్సిటీ చూసి సర్ప్రైజ్ అయ్యామన్నారు. ఫిజిక్ ఉండటం నాకు అడ్వాంటేజ్ అయింది. దాని వల్ల రోల్స్ వచ్చాయి. ఐతే బాడీ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఇంతమంది నమ్మి అవకాశాలు ఇస్తున్నపుడు పర్లేదు. కష్టపడొచ్చు అనుకుంటాను” అని కార్తికేయ అన్నాడు.
This post was last modified on November 9, 2021 8:16 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…