నాటు నాటు అంటూ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి కొత్త పాట రాబోతోంది. ఈ పాటకు సంబంధించి చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ పాట లిరిక్స్ కానీ.. అందులో హీరోల డ్రెస్సింగ్ కానీ.. వాళ్ల బాడీ లాంగ్వేజ్, స్టెప్పులు కానీ.. దాన్ని చిత్రీకరించిన తీరు కానీ.. 1920 స్టయిల్లో ఎంతమాత్రం లేవు. ఈ కథ వందేళ్ల వెనుకటి నేపథ్యంలో నడుస్తుందన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ చేస్తున్నది అల్లూరి సీతారామరాజు పాత్ర అయితే.. తారక్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
వాస్తవంగా ఎప్పుడూ కలవని, వేర్వేరు కాలాలకు చెందిన వీళ్లిద్దరూ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా కలిసి నడిస్తే ఎలా ఉంటుందనే ఊహే ‘ఆర్ఆర్ఆర్’. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోలు చూస్తే పాత-కొత్తల కలయికల్లాగా కనిపించాయి.
ఇప్పుడు రిలీజ్ చేయబోతున్న ‘నాటు నాటు’ పాట చూసినా పాత స్టయిల్లో లేదు. అందులో ఆధునికత కనిపిస్తోంది. ఈ పాట ఈ పీరియడ్ డ్రామాలో ఎలా సెట్టవుతుందో అర్థం కావడం లేదు. ఆ కాలంలో ఈ తరహాలో పాట ఉంటే మాత్రం అది ఎంతమాత్రం నప్పదు. దాని వల్ల సినిమా చెడిపోవచ్చు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోల్లో కూడా అక్కడక్కడా ఆధునిక ఛాయలు కనిపించాయి. కాబట్టి ఈ కథను ఈ కాలంలో మొదలుపెట్టి.. పునర్జన్మల కాన్సెప్ట్‌తోనో.. లేదంటే ఫ్లాష్ బ్యాక్ రూపంలోనో.. వెనుకటి కాలంలోకి తీసుకెళ్లే అవకాశముంది. లేదంటే ‘నాటు నాటు’ సినిమాలో లేకుండా కేవలం ప్రమోషనల్ సాంగ్ లాగా మాత్రమే ఉంటే ఉండొచ్చు. ఈ సస్పెన్సుకు ట్రైలర్ రిలీజయ్యే వరకు తెరపడే అవకాశం లేదు. ట్రైలర్లో కథ గురించి పూర్తి స్పష్టత ఇవ్వడం రాజమౌళికి అలవాటు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో నెలకొన్న సందేహాలకు ట్రైలర్‌తో తెరపడుతుందేమో చూడాలి మరి.
This post was last modified on November 9, 2021 8:04 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…