జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా మీద కొన్నేళ్ల నుంచి గందరగోళం నడుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ అతడి 29వ చిత్రం కాగా.. 30వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో చేయాల్సిన ఈ చిత్రం క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లో, మరో కారణంతోనో ఉన్నట్లుండి రద్దయిపోయింది. దాదాపు ఏడాది చర్చల తర్వాత ఈ సినిమా ఆగిపోవడం అభిమానులను నిరాశ పరిచింది. ఐతే దాని స్థానంలో వెంటనే కొరటాల శివ చిత్రాన్ని ప్రకటించి అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం తీసుకొచ్చాడు తారక్.
కొరటాల మిత్రుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి తారక్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ఐతే ఈ సినిమాను ప్రకటించాక కూడా రకరకాల కారణాల వల్ల ఇది పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగింది. చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. ఇంకా ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకపోవడంతో అభిమానుల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.
ఐతే ఇటు తారక్, అటు కొరటాల తమ కమిట్మెంట్లను ముగించుకుని.. ఫిబ్రవరిలో ఈ సినిమాను మొదలుపెట్టాలని ఫిక్సయినట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించి తారక్ షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసినప్పటికీ.. ప్రమోషన్ల కోసం టైం కేటాయించాల్సి ఉంది. మధ్యలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం కొంత సమయం కేటాయించాడు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు మొదలయ్యే వరకు తారక్ విశ్రాంతికి పరిమితం కానున్నాడు. ఇటీవలి చేతి గాయం వల్ల కూడా తారక్ ఇంకే షూట్స్ పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
మరోవైపు కొరటాల.. తారక్ సినిమా స్క్రిప్టు రెడీ చేస్తూనే ‘ఆచార్య’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడు. చిరుతో ఆయన సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పని మొత్తం ముగిశాక టెన్షన్ లేకుండా తారక్ సినిమాను మొదలుపెట్టాలని కొరటాల ఫిక్సయ్యాడు. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ తాలూకు బడలిక అంతా తీర్చుకుని తాజాగా ఉంటాడు తారక్. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చడం ఖాయమైనట్లే.
This post was last modified on November 9, 2021 7:55 pm
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ‘యురి: ది సర్జికల్ స్ట్రైక్’ దర్శకుడు ఆదిత్య ధర్ స్వీయ నిర్మాణంలో…
తెలుగు సినీ పరిశ్రమలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక యువ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూశాడు. తన పేరు కిరణ్…
వైసీపీ అధినేత జగన్ పై సీఎం చంద్రబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్…
2009లో ప్రపంచ సినీ చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘అవతార్’. ఆ సినిమాకు కొనసాగింపుగా ఏకంగా…
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…