టాలీవుడ్ దర్శకుల్లో చాలామంది హీరోను బట్టి కథ రాసేవాళ్లే. ముందు హీరో ఫిక్సయ్యాక కథలు రాయడం.. లేదంటే కథ రాసేటపుడే ఒక హీరోను దృష్టిలో ఉంచుకోవడం జరుగుతుంటుంది. ముందు కథ రాసి దానికి సెట్టయ్యే హీరోలను ఎంచుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది.
ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రాజా విక్రమార్క’ ప్రోమోలు చూస్తే.. కార్తికేయకు పర్ఫెక్ట్‌గా సెట్ అయిన సినిమాలా కనిపిస్తోంది. దీంతో దీని దర్శకుడు శ్రీ సరిపల్లి కార్తికేయను దృష్టిలో ఉంచుకునే కథ రాసి ఉంటాడని భావిస్తున్నారు. కానీ అది వాస్తవం కాదంటున్నాడు ఈ కొత్త దర్శకుడు. ఈ కథ రాసే టైంకి కార్తికేయ ఎవరో కూడా తెలియదని అతను వెల్లడించాడు. ఈ కథ పూర్తయ్యాకే ‘ఆర్ఎక్స్ 100’ సినిమా రిలీజైందని.. ఆ సినిమాలో, దాని ప్రమోషన్లలో కార్తికేయను చూసి ఇతడికీ కథ పర్ఫెక్ట్‌గా ఉంటుందనిపించి తనను సంప్రదించానని.. కాకపోతే వేరే కమిట్మెంట్ల వల్ల అతనీ సినిమా చేయడం ఆలస్యమైందని మీడియాతో మాట్లాడుతూ శ్రీ సరిపల్లి వెల్లడించాడు.
ఇక తన నేపథ్యం గురించి వివరిస్తూ.. తాను పుట్టి పెరిగింది విజయవాడలో అని.. ఐతే సినిమాల మీద ఆసక్తితో 22 ఏళ్ల వయసులో యుఎస్‌కు వెళ్లి నాలుగేళ్ల పాటు ఫిలిం మేకింగ్ కోర్సు చేశానని.. తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టి దర్శకుడు వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా చేరానని.. తర్వాత మరికొంతమంది దగ్గర పని చేసి సొంతంగా కథలు తయారు చేసుకుని.. ‘రాజా విక్రమార్క’తో దర్శకుడిగా తొలి అవకాశం అందుకున్నానని శ్రీ తెలిపాడు.
తన రెండో సినిమా ‘అల’ పేరుతో రానుందని.. దానికి స్క్రిప్టు పూర్తయిందని.. అందులో ఎవరు నటిస్తారన్నది ‘రాజా కార్తికేయ’ విడుదల తర్వాతే తేలుతుందని అతనన్నాడు. ‘రాజా విక్రమార్క’ నాగార్జున నటించిన ‘నిర్ణయం’ తరహాలో వినోదాత్మకంగా సాగే కాప్ థ్రిల్లర్ మూవీ అని, ఇది కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని శ్రీ ధీమా వ్యక్తం చేశఆడు.
This post was last modified on November 8, 2021 6:41 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…