కొన్నేళ్ల వ్యవధిలో చూస్తుండగానే ఇంతింతై అన్నట్లుగా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. ‘పెళ్ళిచూపులు’ మూవీతో హీరోగా తొలి విజయాన్నందుకుని.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో స్టార్ ఇమేజ్ సంపాదించిన అతను.. ‘గీత గోవిందం’తో మరో స్థాయికి చేరుకున్నాడు. ఓవైపు సినిమాలు చేసుకుంటూనే.. ఇంకో వైపు ‘రౌడీ’ పేరుతో బ్రాండ్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తూ.. మరోవైపు ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టి సినిమాలు తీస్తూ.. అలాగే తమ్ముణ్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నాడు విజయ్.
ఐతే తానున్న బిజీలో ప్రొడక్షన్ హౌస్ నడపడం చాలా కష్టంగానే ఉందంటున్నాడు విజయ్. తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా సొంత బేనర్లో తెరకెక్కిన ‘పుష్పక విమానం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ప్రొడక్షన్ కష్టాల గురించి గుర్తు చేసుకున్నాడు విజయ్.
కెరీర్ ఆరంభంలో తాను పడిన కష్టాలు వేరే వాళ్లు పడకూడదని.. కొత్త వాళ్లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నిర్మాతగా మారానని.. ఐతే నిర్మాణ పనులు చూసుకోవడం చాలా కష్టమైన పని అని.. కొన్నిసార్లు ఇది అవసరమా అనిపిస్తుంటుందని విజయ్ అన్నాడు. నటుడిగా కథలు ఎంపిక చేసుకోవడం, పాత్రల కోసం శిక్షణ తీసుకోవడం.. సినిమాను ప్రమోట్ చేసుకోవడం.. ఇలా తన పని తాను చూసుకోవడానికే సమయం అంతా సరిపోతోందని.. అలాంటిది ఇంకో సినిమాను నిర్మించి, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమంటే మాటలు కాదని.. అందుకే ఒక్కోసారి ఇదంతా అవసరమా అన్న భావన కలుగుతుందని విజయ్ చెప్పాడు. కానీ కొత్త వాళ్లను ప్రోత్సహించడం కోసం, అలాగే అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకం కోసం, అలాగే తనకున్న ఆత్మవిశ్వాసం వల్ల ముందుకెళ్తున్నానని విజయ్ తెలిపాడు.
‘పుష్పక విమానం’ సినిమాలో లీడ్ రోల్‌కు తన తమ్ముణ్ని ఊహించుకోలేకపోయానని.. కానీ అతను ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు చూసి ఆశ్చర్యపోయానని అతనన్నాడు. ఈ సినిమా రిలీజ్ టైంకి ‘లైగర్’ షూట్ కోసం యుఎస్‌లో ఉంటానని.. ఈ సినిమాను మీరే చూసుకోవాలని అభిమానులనుద్దేశించి విజయ్ అన్నాడు.
This post was last modified on %s = human-readable time difference 2:47 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…