Movie News

అనుష్క బ్యాక్ ఆన్ ట్రాక్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క.. ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో ఆమె ‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా బరువు పెరిగింది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనుష్క పెట్టిన ఎఫర్ట్స్ ను ప్రేక్షకులు ప్రశంసించారు. అప్పటినుంచి తన శరీర బరువుని తగ్గించుకునే పనిలో పడింది. పర్సనల్ ట్రైనర్ సహాయంతో బరువు తగ్గి మునుపటి అనుష్కలా మారింది. ఇప్పుడు హెల్తీ షేప్ లోనే ఉంది ఈ బ్యూటీ. దీంతో దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలో అనుష్క యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. అనుష్క శెట్టి-నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తరువాత అనుష్క తన వ్యక్తిగత జీవితంలో కాస్త బిజీ అవ్వడంతో ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందని సమాచారం.

రీసెంట్ గానే అనుష్క ఫైనల్ అగ్రిమెంట్ మీద సైన్ చేసినట్లు తెలుస్తోంది. ‘రారా కృష్ణయ్య’ సినిమాను రూపొందించిన దర్శకుడు మహేష్ పి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ‘నిశ్శబ్దం’ సినిమా తరువాత అనుష్క చేయబోయే సినిమా ఇదే. రేపు అనుష్క పుట్టినరోజు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూద్దాం!

This post was last modified on November 8, 2021 9:59 am

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

8 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago