మెగాహీరో సాయి ధరమ్ తేజ్ కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలు కావడంతో దాదాపు నెల రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించారు. కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడని కూడా టాక్ వచ్చింది. ఫైనల్ గా దసరా సమయంలో ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అప్పటినుంచి తేజుని కలవడానికి చాలా మంది ఇండస్ట్రీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ తేజుకి సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. తాజాగా దీపావళి పండగ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటో చూసిన అభిమానులంతా ఖుషీ అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తేజు ఎంత ఆరోగ్యంగా ఉన్నారంటే.. కొన్ని రోజుల్లోనే షూటింగ్ లో పాల్గొంటారట. జనవరి నెల నుంచి ఈ మెగాహీరో సెట్స్ పైకి వెళ్లనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై, సుకుమార్ శిష్యుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రానా భార్య పాత్రలో ఆమె కనిపించనుంది. కథ ప్రకారం.. ఆమె పాత్ర చిన్నదే అయినప్పటికీ క్రేజ్ ఉన్న సినిమా కావడంతో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఆమెకి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
This post was last modified on November 7, 2021 3:31 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…