ఒక రెండు మూడు దశాబ్దాల పాటు తమిళ సినిమాలో తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు సూపర్ స్టార్ రజినీకాంత్. 90వ దశకంలో ‘బాషా’తో మొదలుపెడితే.. కొన్నేళ్ల ముందు వరకు తమిళ సినిమాల్లో వసూళ్ల పరంగా రికార్డులన్నీ ఆయనవే. క్రేజ్, పారితోషకం, మార్కెట్.. ఇలా ఏ కొలమానం తీసుకున్నా రజినీ ముందు ఎవరూ నిలిచేవారు కాదు.
కానీ గత కొన్నేళ్లలో పరిస్థితు మారిపోయాయి. రజినీ వరుస డిజాస్టర్లతో వెనుకబడిపోయారు. అదే సమయంలో వరుస హిట్లతో విజయ్ ముందుకు దూసుకెళ్లిపోయాడు. ఇప్పుడు రజినీని మించిన మార్కెట్, క్రేజ్ అతడికుంది. డివైడ్ టాక్ తెచ్చుకుంటున్న విజయ్ సినిమాలు సైతం ఇరగాడేస్తుండటం అతడి క్రేజ్‌కు నిదర్శనం. ఇప్పుడు విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ మీద అంచనాలు మామూలుగా లేవు. ఈ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రెండో సినిమా ‘డాక్టర్’ ఇటీవలే విడుదలై బ్లాక్‌బస్టర్ కావడంతో ‘బీస్ట్’ మీద అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడం నెల్సన్ ప్రత్యేకత. తొలి రెండు సినిమాల్లో అది కనిపించింది. ఇప్పుడు విజయ్ సినిమా కోసం అతనో భిన్నమైన కథ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథ చాలా వరకు ఒక షాపింగ్ మాల్‌లోనే నడుస్తుందట.
విలన్ గ్యాంగ్ ఈ షాపింగ్ మాల్‌ను తమ గుప్పెట్లో అందులో ఉన్న వాళ్లందరినీ బందీలుగా మార్చి తమ డిమాండ్ల కోసం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తే.. స్పెషల్ ఆఫీసర్ అయిన హీరో తన టీంతో రంగంలోకి దిగుతాడట. ఇక అతను చేసే ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని సమాచారం. ‘బీస్ట్’ షూటింగ్‌కు సంబంధించి లీక్ అయిన ఫొటోల్లో విజయ్ షాపింగ్ మాల్‌లో తిరుగుతున్నట్లుగానే చూపించారు. దీంతో ఈ కథ గురించిన ప్రచారం నిజమే అని తేలిపోయింది.
విజయ్ సినిమాల్లో యాక్షన్‌కు ఎఫ్పుడూ పెద్ద పీట ఉంటుంది. నెల్సన్ స్టైల్ ఎంటర్టైన్మెంట్, విజయ్ మార్కు స్టైలిష్ యాక్షన్ మిక్స్ అయ్యాయంటే సినిమా ఒక రేంజిలో ఉంటుందని ఆశించవచ్చు. అదిరింది, విజిల్, మాస్టర్ సినిమాలు తెలుగులో కూడా మంచి ఫలితాన్నందుకున్న నేపథ్యంలో ‘బీస్ట్’ను కూడా పెద్ద ఎత్తునే రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే వేసవికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావచ్చు.
This post was last modified on November 4, 2021 8:25 am
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు,…
బుట్టబొమ్మ అని రామజోగయ్య శాస్త్రి గారు రాసినట్టు ఆ పదానికి న్యాయం చేకూర్చే అందంతో పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం…