2022 సంక్రాంతి సినిమాల గత కొన్ని నెలల్లో చాలా ట్విస్టులు చూశాం. పండక్కి ముందు అనుకున్న సినిమాలైతే హరిహర వీరమల్లు, సర్కారు వారి పాట మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ సినిమా ఆల్రెడీ రేసు నుంచి తప్పుకుంది. ‘సర్కారు వారి పాట’ పక్కా అంటే పక్కా అన్నారు కానీ.. ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది. సంక్రాంతి రేసులో నిలిచిన మరో పవన్ సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా పండక్కి రావడం డౌట్‌గానే ఉంది. ప్రస్తుతానికి ఉన్న అంచనా ప్రకారం జనవరి 7న ‘ఆర్ఆర్ఆర్’.. 14న ‘రాధేశ్యామ్’ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐతే ఈ రెండు మాత్రమే రేసులో ఉండేట్లయితే తన సినిమా ‘బంగార్రాజు’ను రిలీజ్ చేయడానికి నాగ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. పై రెండు భారీ చిత్రాలతో పోలిస్తే తనది పూర్తి భిన్నమైన సినిమా అని, పండుగ టైంలో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారని, అలాగే ఓవర్ ఫ్లోస్ కలిసొస్తాయని.. ఇలా నాగ్ లెక్కలు నాగ్‌కు ఉన్నాయి.
ఇంతటితో సంక్రాంతి పందెం కోళ్ల సంగతి ఫిక్స్ అయినట్లేనా అంటే అలా ఏమీ కనిపించడం లేదు. కొత్తగా ఇప్పుడు సంక్రాంతి రేసులోకి మరో సినిమా వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అదే.. శేఖర్. సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. ఈ సినిమాను ప్రకటించి ఏడాది దాటింది. కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యమైన ఈ చిత్రం కొన్ని నెలలుగా అసలు వార్తల్లో లేదు.
ఐతే కరోనా నుంచి కోలుకున్నాక రాజశేఖర్ సైలెంటుగా ఈ సినిమాను పున:ప్రారంభించి చకచకా లాగించేస్తున్నారట. సినిమా పూర్తి కావస్తోందట. సంక్రాంతికి నాలుగు సినిమాలొచ్చినా ప్రేక్షకులు చూస్తారని.. తక్కువ బడ్జెట్లో తీసిన ఈ సినిమాను పండుగ రేసులో నిలబెడితే ఈజీగా పాసైపోవచ్చని అనుకుంటున్నారట. మలయాళ హిట్ ‘జోసెఫ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లలిత్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నాడు. రాజశేఖఱ్ సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాజశేఖర్ తెల్లటి గడ్డంతో నడి వయస్కుడిగా కనిపించనున్నాడు.
This post was last modified on November 3, 2021 6:37 am
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…