Movie News

ఆర్ఆర్ఆర్.. నార్మల్ మోడ్‌ కావాలి

ఏమో అనుకున్నాం కానీ.. ‘ఆర్ఆర్ఆర్’ మామూలు సినిమా కాదని.. ‘బాహుబలి’కి దీటుగా ఉండబోతోందని.. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను రాజమౌళి షేక్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది. సినిమా మొదలైనప్పుడు ఉన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ విడుదల ముంగిట ‘బాహుబలి’ తరహా యుఫోరియానే ఈ చిత్రం కూడా క్రియేట్ చేస్తోంది.

‘ఆర్ఆర్ఆర్ నుంచి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా అది గూస్ బంప్స్ ఇచ్చేస్తోంది. సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది. ఫస్ట్ టైటిల్ టీజర్ దగ్గర్నుంచి తాజాగా రిలీజ్ చేసిన 45 సెకన్ల గ్లింప్స్ వరకు ప్రతిదీ నోరెళ్లబెట్టి చూసేలాగే ఉంది. కాకపోతే ‘ఆర్ఆర్ఆర్‌’ నుంచి వస్తున్న వీడియో గ్లింప్స్‌తో ఒక సమస్య ఉంటోంది. రామ్ చరణ్, తారక్‌ల పాత్రలకు సంబంధించిన టీజర్స్ అయినా.. మేకింగ్ వీడియో అయినా.. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ అయినా ఫాస్ట్ ఫార్వార్డ్‌‌లో నడవడమే ఆ సమస్య.

వీటిలో ఏ ఒక్క షాట్ కూడా ఒక్క క్షణం నిడివితో కూడా లేదు. రెప్పపాటలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవే. సినిమా కాన్సెప్ట్ ఏంటో.. ఎవరి పాత్రలు ఎలా ఉంటాయో.. ఏం హైలైట్స్ ఏంటో ఆగి ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. వీడియోను స్లో మోషన్లోకి మార్చి.. స్క్రీన్ షాట్లు తీసుకుని ఎవరికి తోచిన భాష్యాలు వాళ్లు చెప్పుకుంటున్నారు. మరీ ఇంత ఫాస్ట్ ఫార్వార్డ్ వీడియోలు చేసి జనాలను ఇంత ఊరించడమేంటి.. ఒకటి రెండయితే ఓకే కానీ.. ప్రతిసారీ ఇలాగే ఉంటే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కనీసం ట్రైలర్లో అయినా ఈ ఫాస్ట్ ఫార్వార్డ్ మోడ్‌ పక్కన పెట్టి నార్మల్ మోడ్‌లో నెమ్మదిగా సాగేలా కట్ ఉంటే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో హైలైట్లను ముందే విప్పి చూపించేయడం ఇష్టం లేక జక్కన్న ఇలా ఫ్లాష్ లాగా చూపించి ఊరిస్తున్నాడేమో కానీ.. దీని వల్ల ప్రేక్షకుల్లో ఒకరకమైన అసహనం కూడా కలుగుతోంది. కాబట్టి ట్రైలర్ విషయంలో రూట్ మారిస్తే బెటర్.

This post was last modified on November 3, 2021 6:38 am

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

11 minutes ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

2 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

2 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

2 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

6 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

6 hours ago