తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది సమంత. బ్రేకప్ తరువాత తను బాగానే ఉన్నట్లు సోషల్ మీడియా పోస్ట్ ల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది. తన స్నేహితులతో కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. మరోపక్క తన బట్టల బ్రాండ్ ను ప్రమోట్ చేస్తుంది.
ఇక కెరీర్ లో బిజీ అవ్వాలని నిర్ణయించుకోవడంతో వరుస సినిమాలు సైన్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమా, అలానే మరో బైలింగ్యువల్ సినిమా చేయబోతుంది.
ఇవి కాకుండా.. కొన్ని రోజులుగా సమంత బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ తరువాత సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆమెకి మంచి అవకాశాలే వస్తున్నాయి. అయితే తన మొదటి బాలీవుడ్ సినిమాను మాత్రం తాప్సీ బ్యానర్ లో చేయడానికి రెడీ అవుతోందట సమంత. రీసెంట్ గానే తాప్సీ సొంతంగా నిర్మాణ సంస్థను స్థాపించింది. దీనికి అవుట్ సైడర్స్ ఫిలిమ్స్ అనే పేరు కూడా పెట్టింది.
బాలీవుడ్ లో ఈ బ్యానర్ పేరు హాట్ టాపిక్ అయింది. కావాలనే తాప్సీ అవుట్ సైడర్స్ అనే పేరు పెట్టిందంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇదే బ్యానర్ లో విమెన్ సెంట్రిక్ సినిమా చేయబోతుంది సమంత. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది కాకుండా.. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు సమంతతో వెబ్ బేస్డ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…