Movie News

ఆ సినిమా ఎట్ట‌కేల‌కు రిలీజ్

గత కొన్నేళ్ల‌లో సౌత్ ఇండియాలో అత్య‌ధికంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ల‌లో కీర్తి సురేష్ పేరు ముందు చెప్పుకోవాలి. లెజెండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన‌ మ‌హాన‌టిలో అద్భుత అభిన‌యం ప్ర‌దర్శించి, ఆ సినిమాతో భారీ విజ‌యాన్నందుకోవ‌డంతో కీర్తి కోసం హీరోయిన్ ప్ర‌ధాన క‌థ‌లు వెతుక్కుంటూ వ‌చ్చాయి.

పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖి.. ఇలా వ‌రుస‌గా ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ఇవి అటు ఇటుగా క‌రోనా టైంలోనే పూర్తయి.. విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. ఐతే పెంగ్విన్, మిస్ ఇండియా గ‌త ఏడాదే ఓటీటీ ద్వారా రిలీజై కీర్తి అభిమానుల‌కు తీవ్ర నిరాశ మిగ‌ల్చ‌డ‌గా.. ఎప్పుడో పూర్త‌యిన‌ గుడ్ ల‌క్ స‌ఖి చిత్ర‌మే అడ్ర‌స్ లేకుండా పోయింది. ఆ సినిమా గురించి జ‌నాలు మాట్లాడుకుని చాలా నెల‌లైపోయింది.

ఇక ఈ సినిమా రిలీజ్ కాదా అని సందేహిస్తున్న స‌మ‌యంలో ఇటీవ‌ల కీర్తి పుట్టిన రోజు సంద‌ర్భంగా కమింగ్ సూన్ అని పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ చిత్రానికి విడుద‌ల తేదీ కూడా ఖరారైంది. న‌వంబ‌రు 26న గుడ్ ల‌క్ స‌ఖి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డిసెంబ‌రులో వివిధ భాష‌ల్లో పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతుండ‌గా.. న‌వంబ‌రులో చాలా వ‌ర‌కు చిన్న‌, మీడియం రేంజ్ సినిమాలే రిలీజ‌వుతున్నాయి. ఈ వ‌రుస‌లో గుడ్ ల‌క్ స‌ఖిని కూడా థియేట‌ర్ల‌లోకి దించేస్తున్నారు.

హైద‌రాబాద్ బ్లూస్, ఇక్బాల్ లాంటి క్లాసిక్స్ తీసిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు న‌గేష్ కుకునూర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. మ‌ధ్య‌లో బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు టేక‌ప్ చేయ‌డం విశేషం. జ‌గ‌ప‌తిబాబు, ఆది పినిశెట్టి కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రంలో కీర్తి.. గిరిజ‌న తెగ‌కు చెందిన‌ ఆర్చ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ గుడ్ ల‌క్ స‌ఖికి సంగీతాన్నందించాడు.

This post was last modified on November 2, 2021 7:18 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 minute ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

1 hour ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

1 hour ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

4 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

5 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

5 hours ago